Stock market : ట్రేడర్స్ అలర్ట్- హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్ షేర్ ప్రైజ్ టార్గెట్స్ ఇవే..
అక్టోబర్ 5, 2026 ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్, ముడి చమురు ధరని ఇక్కడ తెలుసుకోండి..
గాంధీ జయంతి కారణంగా శుక్రవారం స్టాక్ మార్కెట్లకు సెలవు. ఇక గురువారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 580 పాయింట్లు పడి 71,910 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 199 పాయింట్లు కోల్పోయి 22,422 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 182 పాయింట్లు పడి 54,451 వద్దకు చేరింది.

ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
గురువారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 9,484.22 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 10,041.84 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ స్వల్ప లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 50 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగించాయి. డౌ జోన్స్ 0.50 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 0.7శాతం వృద్ధిచెందింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 1.2 శాతం పెరిగింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్లో లాభాల్లో కొనసాగుతున్నాయి.
ఇదీ చూడండి : నిఫ్టీ 22,000 కిందకు పడితే బేర్ల పండుగే: విశ్లేషకుల హెచ్చరిక
ముడి చమురు ధర..
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర 100 డాలర్ల ఎగువన ట్రేడ్ అవుతోంది. బ్రెంట్ క్రూడ్ 0.79శాతం పడి బ్యారెల్‌కు 101.3 డాలర్ల వద్ద ఉంది.
స్టాక్స్ టు బై లిస్ట్..
హెచ్డీఎఫ్సీ బ్యాంక్- బై రూ. 710-720, స్టాప్ లాస్ రూ. 680, టార్గెట్ రూ. 760
ఇన్ఫోసిస్- బై రూ. 1020- 1040, స్టాప్ లాస్ రూ. 980, టార్గెట్ రూ. 1180
బీఈఎల్- బై రూ. 390- 395, స్టాప్ లాస్ రూ. 380, టార్గెట్ రూ. 410
సాజిలిటీ- బై రూ. 43.17, స్టాప్ లాస్ రూ. 41.50, టార్గెట్ రూ. 46.5
ఉజ్జీవన్ ఎస్ఎఫ్బీ- బై రూ. 65.6, స్టాప్ లాస్ రూ. 62.5, టార్గెట్ రూ. 71
ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ- బై రూ. 91, స్టాప్ లాస్ రూ. 87, టార్గెట్ రూ. 99
బజాజ్ హెచ్ఎఫ్ఎల్- బై రూ. 82.9, స్టాప్ లాస్ రూ. 79, టార్గెట్ రూ. 89
జయస్వాల్ నెకో ఇండస్ట్రీస్- బై రూ. 91.2, స్టాప్ లాస్ రూ. 86.7, టార్గెట్ రూ. 100
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


