బుధవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 252 పాయింట్లు పడి 72,782 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 99 పాయింట్లు కోల్పోయి 22,623 వద్ద సెషన్ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 165 పాయింట్లు పడి 55,316 వద్దకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..

బుధవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 1,857.44 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2,670.44 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక గురువారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్ ఫ్లాట్గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 10 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
బుధవారం ట్రేడింగ్ సెషన్ని అమెరికా స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగించాయి. డౌ జోన్స్ ఫ్లాట్గా క్లోజ్ అయ్యింది. ఎస్ అండ్ పీ 500 1శాతం పడింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 2 శాతం డౌన్ అయ్యింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు గురువారం ట్రేడింగ్ సెషన్లో భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధర..
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర 100 డాలర్ల ఎగువనే కొనసాగుతోంది. గురువారం ట్రేడింగ్లో బ్రెంట్ క్రూడ్ 1.6శాతం పడి బ్యారెల్కు 10.4 డాలర్లకు చేరింది.
స్టాక్స్ టు బై..
జిందాల్ సా లిమిటెడ్- బై రూ. 297, స్టాప్ లాస్ రూ. 280, టార్గెట్ రూ. 342
శ్యామ్ మెటాలిక్స్ అండ్ ఎనర్జీ- బై రూ. 1141, స్టాప్ లాస్ రూ. 1070, టార్గెట్ రూ. 1290
{{/usCountry}}శ్యామ్ మెటాలిక్స్ అండ్ ఎనర్జీ- బై రూ. 1141, స్టాప్ లాస్ రూ. 1070, టార్గెట్ రూ. 1290
{{/usCountry}}ఐసీఐసీఐజీఐ- బై రూ. 1720, స్టాప్ లాస్ రూ. 1650, టార్గెట్ రూ. 1910
బీహెచ్ఈఎల్- బై రూ. 466, స్టాప్ లాస్ రూ. 439, టార్గెట్ రూ. 510
ఫస్ట్ క్రై- బై రూ. 183, స్టాప్ లాస్ రూ. 175, టార్గెట్ రూ. 201