బుధవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 352 పాయింట్లు పడి 73,246 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 51 పాయింట్లు కోల్పోయి 22,699 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ మాత్రం 292 పాయింట్లు పెరిగి 54,267 వద్దకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..

బుధవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 871.83 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 643.35 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక గురువారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ ఫ్లాట్‌గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 35 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
“నిఫ్టీ50కి కీలక సపోర్ట్ 22,500 వద్ద ఉంది. ఇక్కడే బయ్యింగ్ ఆసక్తి తరచూ కనిపిస్తోంది. 22,800 కీలక రెసిస్టెన్స్ ఉంది. ఈ లెవల్స్‌లో ఏది ముందు బ్రేక్ అయితే సూచీ అటువైపు డైరక్షన్ తీసుకోవచ్చు,” అని ఎల్కేపీ సెక్యూరిటీస్ టెక్నికల్ రీసెర్చ్ ఎనలిస్ట్ వాత్సల్ భువ తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
బుధవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గ్ ముగించాయి. డౌ జోన్స్ 0.2 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 0.3శాతం వృద్ధిచెందింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.2 శాతం పెరిగింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు గురువారం ట్రేడింగ్ సెషన్లో ఫ్లాట్‌గా కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధర..
గురువారం ట్రేడింగ్ సెషన్లో బ్రెంట్ క్రూడ్ 0.6శాతం పడి బ్యారెల్‌కు 114.5 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.
స్టాక్స్ టు బై..
{{/usCountry}}గురువారం ట్రేడింగ్ సెషన్లో బ్రెంట్ క్రూడ్ 0.6శాతం పడి బ్యారెల్‌కు 114.5 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.
స్టాక్స్ టు బై..
{{/usCountry}}జీసీషిప్- బై రూ. 1565, స్టాప్ లాస్ రూ. 1505, టార్గెట్ రూ. 1695
ఎల్జీ ఇండియా- బై రూ. 1691, స్టాప్ లాస్ రూ. 1605, టార్గెట్ రూ. 1850
హెచ్‌బీఎల్ ఇంజనీరింగ్- బై రూ. 810, స్టాప్ లాస్ రూ. 765, టార్గెట్ రూ. 890