బుధవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 49 పాయింట్లు పడి 72,480 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 96 పాయింట్లు కోల్పోయి 22,620 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ మాత్రం 373 పాయింట్లు పెరిగి 54,633 వద్దకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
బుధవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 10,148.41 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 11,271.73 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక గురువారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ ఫ్లాట్‌గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 30 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
బుధవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. డౌ జోన్స్ 0.85 శాతం పతనమైంది. ఎస్ అండ్ పీ 500 0.25శాతం పడింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.2 శాతం డౌన్ పెరిగింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు గురువారం ట్రేడింగ్ సెషన్లో ఫ్లాట్‌గా కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధర..
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర స్వల్పంగా దిగొచ్చింది. బ్రెంట్ క్రూడ్ ధర 0.34శాతం పడి బ్యారెల్‌కి 97.7 డాలర్లకు చేరింది.
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
పీవీఆర్ ఐనాక్స్- బై రూ. 1243, స్టాప్ లాస్ రూ. 1180, టార్గెట్ రూ. 1370
జేకే టైర్- బై రూ. 347, స్టాప్ లాస్ రూ. 330, టార్గెట్ రూ. 380
{{/usCountry}}జేకే టైర్- బై రూ. 347, స్టాప్ లాస్ రూ. 330, టార్గెట్ రూ. 380
{{/usCountry}}ఐసీఐసీఐ లంబార్డ్- బై రూ. 1590, స్టాప్ లాస్ రూ. 1510, టార్గెట్ రూ. 1750
టెక్స్మాకో రెయిల్- బై రూ. 131, స్టాప్ లాస్ రూ. 125, టార్గెట్ రూ. 145
మిశ్రా ధాతు- బై రూ. 437, స్టాప్ లాస్ రూ. 416, టార్గెట్ రూ. 480