బుధవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 813 పాయింట్లు పడి 74,764 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 204 పాయింట్లు కోల్పోయి 23,431 వద్ద సెషన్ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 482 పాయింట్లు పడి 56,296 వద్దకు చేరింది.

అమెరికా- ఇరాన్ మధ్య అనిశ్చితుల కారణంగా ముడి చమురు ధర భగ్గుమంది. ఫలితంగా ప్రపంచ స్టాక్ మార్కెట్లు ఒత్తిడికి గురవుతున్నాయి.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
బుధవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 582.99 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1509.04 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక గురువారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 90 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
బుధవారం ట్రేడింగ్ సెషన్ని అమెరికా స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగించాయి. డౌ జోన్స్ 0.77 శాతం పతనమైంది. ఎస్ అండ్ పీ 500 0.48శాతం పడింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.64 శాతం డౌన్ అయ్యింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు గురువారం ట్రేడింగ్ సెషన్లో ఫ్లాట్గా కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధర..
అంతర్జాతీయ అనిశ్చితుల ప్రభావం చమురు ధరపై భారీగా పడుతోంది. గురువారం ట్రేడింగ్ సెషన్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్కు 101.34 డాలర్లకు చేరింది.
స్టాక్స్ టు బై..
సాయి లైఫ్ సైన్సెస్- బై రూ. 1675, స్టాప్ లాస్ రూ. 1618, టార్గెట్ రూ. 1795
{{/usCountry}}సాయి లైఫ్ సైన్సెస్- బై రూ. 1675, స్టాప్ లాస్ రూ. 1618, టార్గెట్ రూ. 1795
{{/usCountry}}ఫినోలెక్స్ కేబుల్స్- బై రూ. 1353, స్టాప్ లాస్ రూ. 1307, టార్గెట్ రూ. 1450
బీహెచ్ఈఎల్- బై రూ. 433, స్టాప్ లాస్ రూ. 426, టార్గెట్ రూ. 445
వేదాంత- బై రూ. 273, స్టాప్ లాస్ రూ. 266, టార్గెట్ రూ. 282
ఆల్కెం లాబోరేటరీస్- బై రూ. 5140, స్టాప్ లాస్ రూ. 5050, టార్గెట్ రూ. 5300
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
వన్ 97 కమ్యూనికేషన్స్- బై రూ. 1751, స్టాప్ లాస్ రూ. 1690, టార్గెట్ రూ. 1875
గ్లోబల్ హెల్త్ (మేదాంత)- బై రూ. 1480, స్టాప్ లాస్ రూ. 1428, టార్గెట్ రూ. 1585
అదానీ పవర్- బై రూ. 215, స్టాప్ లాస్ రూ. 207, టార్గెట్ రూ. 230
జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా- బై రూ. 341.4, స్టాప్ లాస్ రూ. 330, టార్గెట్ రూ. 365
ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ- బై రూ. 1066, స్టాప్ లాస్ రూ. 1030, టార్గెట్ రూ. 1140