గురువారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 138 పాయింట్లు పెరిగి 74,903 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 46 పాయింట్లు వృద్ధిచెంది 23,478 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 712178 పాయింట్లు పెరిగి 56,472 వద్దకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
మంగళవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 438.24 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1,025.85 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 125 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
గురువారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ముగించాయి. డౌ జోన్స్ 0.6 శాతం పతనమైంది. ఎస్ అండ్ పీ 500 0.6శాతం పడింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.65 శాతం డౌన్ అయ్యింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో నష్టాల్లో కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధర..
గత కొన్ని రోజులుగా ముడి చమురు ధర పెరుగుతూనే ఉంది. తాజాగా బ్రెంట్ క్రూడ్ 1శాతం పెరిగి బ్యారెల్‌కి 108.6 డాలర్లకు చేరింది.
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
బ్లూ స్టార్- బై రూ. 1514, స్టాప్ లాస్ రూ. 1461, టార్గెట్ రూ. 1620
రెడింగ్టన్- బై రూ. 392, స్టాప్ లాస్ రూ. 378, టార్గెట్ రూ. 420
{{/usCountry}}రెడింగ్టన్- బై రూ. 392, స్టాప్ లాస్ రూ. 378, టార్గెట్ రూ. 420
{{/usCountry}}మనప్పురం ఫైనాన్స్- బై రూ. 331, స్టాప్ లాస్ రూ. 320, టార్గెట్ రూ. 355
క్లీన్ సైన్స్ అండ్ టెక్నాలజీ- బై రూ. 848, స్టాప్ లాస్ రూ. 818, టార్గెట్ రూ. 908
అతుల్- బై రూ. 6356, స్టాప్ లాస్ రూ. 6133, టార్గెట్ రూ. 6800