మంగళవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 4227 పాయింట్లు పెరిగి 82,532 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 96 పాయింట్లు వృద్ధిచెంది 25,387 వద్ద సెషన్ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 697 పాయింట్లు పెరిగి 62,273 వద్దకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..

మంగళవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 4,195.38 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 196.93 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక బుధవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 105 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
“నిఫ్టీ50కి 25,500 వద్ద కీలక రెసిస్టెన్స్ ఉంది. అది బ్రేక్ చేసి పైకి వెళ్లలేకపోతోంది. ఇప్పటికైతే పాజిటివ్ ట్రెండే కొనసాగుతోంది. 25,500 బ్రేక్ అయితే సూచీ 25,900- 26,000 వరకు ర్యాలీ అవ్వొచ్చు. ఇక నిఫ్టీ50కి 25,100 వద్ద కీలక సపోర్ట్ ఉంది,” అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్కి చెందిన సీనియర్ టెక్నికల్ రీసెర్చ్ ఎనలిస్ట్ నాగరాజ్ శెట్టి తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
మంగళవారం ట్రేడింగ్ సెషన్ని అమెరికా స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగించాయి. డౌ జోన్స్ 1.6 శాతం పతనమైంది. ఎస్ అండ్ పీ 500 1.03 శాతం పడింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.74 శాతం డౌన్ అయ్యింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు బుధవారం ట్రేడింగ్ సెషన్లో లాభాల్లో దూసుకెళుతున్నాయి.
ముడి చమురు ధర..
{{/usCountry}}ఆసియా స్టాక్ మార్కెట్లు బుధవారం ట్రేడింగ్ సెషన్లో లాభాల్లో దూసుకెళుతున్నాయి.
ముడి చమురు ధర..
{{/usCountry}}బుధవారం ట్రేడింగ్ సెషన్లో బ్రెంట్ క్రూడ్ 0.5శాతం పడి బ్యారెల్కు 92.6 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
స్టాక్స్ టు బై..
వెల్పన్ లివ్- బై రూ. 266, స్టాప్ లాస్ రూ. 253, టార్గెట్ రూ. 295
డెల్హివరీ- బై రూ. 458, స్టాప్ లాస్ రూ. 435, టార్గెట్ రూ. 495
ఛోలాఫిన్- బై రూ. 1888, స్టాప్ లాస్ రూ. 1800, టార్గెట్ రూ. 2088