...
...
Next Story

Stock market : ట్రేడర్స్​ అలర్ట్- నేటి స్టాక్స్​ టు బై లిస్ట్, చమురు ధర అప్డేట్స్..

ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు చమురు ధర, లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ని ఇక్కడ తెలుసుకోండి..

Published on: Sep 21, 2026, 08:16:55 IST
Advertisement

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 20 పాయింట్లు పడి 74,295 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 76 పాయింట్లు పెరిగి 23,346 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 303 పాయింట్లు పెరిగి 56,359 వద్దకు చేరింది.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

స్టాక్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్స్..
స్టాక్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్స్..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 599.54 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1019.69 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 60 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. డౌ జోన్స్​ 0.18 శాతం పతనమైంది. ఎస్​ అండ్​ పీ 500​ 0.17శాతం పెరిగింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 0.39 శాతం వృద్ధి చెందింది.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఫ్లాట్​గా కొనసాగుతున్నాయి.

ముడి చమురు ధర..

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ముడి చమురు ధర స్వల్పంగా పడింది. బ్రెంట్ క్రూడ్ 0.78శాతం పడి బ్యారెల్​కి 103.06 డాలర్లకు చేరింది.

స్టాక్స్​ టు బై..

ఎలక్ట్రానిక్స్ మార్ట్ ఇండియా లిమిటెడ్- బై రూ. 194- రూ. 197, స్టాప్​ లాస్​ రూ. 185, టార్గెట్​ రూ. 230

సన్​సెరా- బై రూ. 4265, స్టాప్​ లాస్​ రూ. 4065, టార్గెట్​ రూ. 4765

కాన్​ఫిపెట్- బై రూ. 92, స్టాప్​ లాస్​ రూ. 88, టార్గెట్​ రూ. 101

సుదర్స్​కెమ్- బై రూ. 1265, స్టాప్​ లాస్​ రూ . 1205, టార్గెట్​ రూ. 1385

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks