...
...
Next Story

Stock market : రూ. 110 దాటేసిన ముడి చమురు ధర- ఈరోజు స్టాక్ మార్కెట్ పరిస్థితేంటి?

అక్టోబర్ 22, 2026 ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్, ముడి చమురు ధర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Oct 22, 2026, 08:15:34 IST
Advertisement

బుధవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 143 పాయింట్లు పడి 73,710 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 78 పాయింట్లు కోల్పోయి 22,811 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 511 పాయింట్లు పడి 54,977 వద్దకు చేరింది.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

స్టాక్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్స్..
స్టాక్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్స్..

బుధవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 1,022.32 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1,614.32 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక గురువారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 50 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

“నిఫ్టీ50 తన 20డీఎంఏ రేంజ్​లో తిరుగుతోంది. కానీ హయ్యర్ హైస్, హయ్యర్ లోస్​ పాటర్న్ మాత్రం కొనసాగుతోంది. 22,720 కీలక సపోర్ట్​ జోన్​ని సూచీ తట్టుకుంటోంది. అది బ్రేక్ అయితే మాత్రం సూచీ 22,650- 22,600కి వెళ్లే అవకాశం ఉంది. ఇక 22,900- 23,000 వద్ద ఉన్న రిసెస్టెన్స్ ఉంది. 23,150 వద్ద ఉన్న మరో రెసిస్టెన్స్​ని దాటితే నిఫ్టీ50 మరింత పెరగొచ్చు,” అని ఏంజిల్​ వన్​కి చెందిన చీఫ్ మేనేజర్, టెక్నికల్ అండ్ డెరివేటివ్ రీసెర్చ్ ఓషో కృష్ణన్ తెలిపారు.

ఐటీ షేర్ల జాతర: ఎల్‌టీటీఎస్ 15% అప్, దూసుకెళ్లిన టీసీఎస్, ఇన్ఫోసిస్

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

ఆసియా స్టాక్​ మార్కెట్​లు బుధవారం ట్రేడింగ్​ సెషన్​లో నష్టాల్లో కొనసాగుతున్నాయి.

ముడి చమురు ధర..

అంతర్జాతీయ మార్కెట్​లో ముడి చమురు ధర భగభగలాడుతోంది. గురువారం ట్రేడింగ్​ సెషన్​లో బ్రెంట్ క్రూడ్ 1శాతం కన్నా ఎక్కువ పెరిగి బ్యారెల్​కు 110.2 డాలర్లకు చేరింది.

స్టాక్స్​ టు బై..

కాస్ట్రోల్ ఇండ్- బై రూ. 198, స్టాప్​ లాస్​ రూ. 188, టార్గెట్​ రూ. 211

హెక్సావేర్ టెక్నాలజీస్ లిమిటెడ్- బై రూ. 594- రూ. 603, స్టాప్​ లాస్​ రూ. 569, టార్గెట్​ రూ. 700

టీసీఎస్- బై రూ. 2504- రూ. 2542, స్టాప్​ లాస్​ రూ. 2400, టార్గెట్​ రూ. 2790

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks