...
...
Next Story

Stock Market : ట్రేడర్స్ అలర్ట్- స్విగ్గీ షేర్ ప్రైజ్ టార్గెట్ ఇదే..

నవంబర్ 23, 2026 ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్, ముడి చమురు ధర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Nov 23, 2026, 07:34:53 IST
Advertisement

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 898 పాయింట్లు పెరిగి 83,920 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 286 పాయింట్లు వృద్ధిచెంది 25,801 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 1572 పాయింట్లు పెరిగి 64,635 వద్దకు చేరింది.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

స్టాక్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్స్..
స్టాక్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్స్..

మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో డీఐఐ రూ. 4,859.80 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో ఎఫ్​ఐఐలు రూ. 10,308.42 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 155 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

“నిఫ్టీ50 ఇక్కడి నుంచి 26,000వైపు కదలొచ్చు. అక్కడి నుంచి 26,350 వరకు వెళ్లొచ్చు. దీనికి 1, 2 వారాల సమయం పట్టొచ్చు. ఇక 25,500 వద్ద సూచీకి సపోర్ట్ లభిస్తుంది,” అని అని హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్​కి చెందిన సీనియర్​ టెక్నికల్​ రీసెర్చ్​ ఎనలిస్ట్​ నాగరాజ్​ శెట్టి తెలిపారు.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు భారీ నష్టాల్లో ముగించాయి. డౌ జోన్స్​ 1.93 శాతం పతనమైంది. ఎస్​ అండ్​ పీ 500​ 3.7శాతం పడింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 5.6 శాతం డౌన్​ అయ్యింది.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఫ్లాట్​గా కొనసాగుతున్నాయి.

ముడి చమురు ధర..

నువోకో- బై రూ. 361, స్టాప్​ లాస్​ రూ. 340, టార్గెట్​ రూ. 389

ఎన్​హెచ్- బై రూ. 1950, స్టాప్​ లాస్​ రూ. 1860, టార్గెట్​ రూ. 2145

సింజిన్- బై రూ. 453, స్టాప్​ లాస్​ రూ .427, టార్గెట్​ రూ. 498

స్విగ్గీ- బై రూ. 179, స్టాప్​ లాస్​ రూ. 175, టార్గెట్​ రూ. 190

టాటా కెమికల్స్- బై రూ. 640, స్టాప్​ లాస్​ రూ. 610, టార్గెట్​ రూ. 700

ఆంబర్ ఎంటర్​ప్రైజ్- బై రూ. 6750, స్టాప్​ లాస్​ రూ. 6300, టార్గెట్​ రూ. 7300

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

 

ABOUT THE AUTHOR

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks