బుధవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 183 పాయింట్లు పడి 77,473 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 127 పాయింట్లు కోల్పోయి 24,208 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ మాత్రం 267 పాయింట్లు పెరిగి 57,784 వద్దకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..

మంగళవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 502.63 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 6,425.16 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక గురువారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 95 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
“నిఫ్టీ50కి 24,115 సపోర్ట్ లెవెల్‌గా ఉండనుంది. ఇది బుధవారం నాటి ఇంట్రాడే లో. దీని కన్నా దిగువకు పడితే సూచీ 24,000- 24,040 వరకు వెళ్లొచ్చు. ఇక 24,400 వద్ద నిఫ్టీ50కి కీలక రెసిస్టెన్స్ ఉంది,” అని స్టాక్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
బుధవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. డౌ జోన్స్ 0.23 శాతం పతనమైంది. ఎస్ అండ్ పీ 500 0.02శాతం పడింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.08 శాతం డౌన్ అయ్యింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు గురువారం ట్రేడింగ్ సెషన్లో ఫ్లాట్‌గా కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధర..
గురువారం ట్రేడింగ్ సెషన్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ 0.6శాతం పడి బ్యారెల్‌కు 87.2 డాలర్లకు చేరింది.
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
{{/usCountry}}గురువారం ట్రేడింగ్ సెషన్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ 0.6శాతం పడి బ్యారెల్‌కు 87.2 డాలర్లకు చేరింది.
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
{{/usCountry}}రస్సెల్ టెక్సిస్- బై రూ. 1100, స్టాప్ లాస్ రూ. 1048, టార్గెట్ రూ. 1190
యథార్త్ హాస్పిటల్ అండ్ ట్రౌమా కేర్ సర్వీసెస్- బై రూ. 965, స్టాప్ లాస్ రూ. 910, టార్గెట్ రూ. 1050
ఇండిగో పెయింట్స్- బై రూ. 1186, స్టాప్ లాస్ రూ. 1125, టార్గెట్ రూ. 1280
లుమాక్స్ ఇండస్ట్రీస్- బై రూ. 6160, స్టాప్ లాస్ రూ. 5785, టార్గెట్ రూ. 6700
క్రాస్- బై రూ. 218, స్టాప్ లాస్ రూ. 205, టార్గెట్ రూ. 235