మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 555 పాయింట్లు పడి 75,578 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 144 పాయింట్లు కోల్పోయి 23,635 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 311 పాయింట్లు పడి 56,778 వద్దకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..

మంగళవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 123.19 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1,349.64 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక బుధవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 100 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగించాయి. డౌ జోన్స్ 1.18 శాతం పతనమైంది. ఎస్ అండ్ పీ 500 0.58శాతం పడింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.32 శాతం డౌన్ అయ్యింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు బుధవారం ట్రేడింగ్ సెషన్లో నష్టాల్లో కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధర..
అంతర్జాతీయ అనిశ్చితుల కారణంగా ముడి చమురు ధర మరింత పెరిగింది. బ్రెంట్ క్రూడ్ 1.6శాతం పెరిగి బ్యారెల్‌కి 99.49 డాలర్లకు చేరింది.
స్టాక్స్ టు బై..
హిందుస్థాన్ కాపర్- బై రూ. 533, స్టాప్ లాస్ రూ. 519, టార్గెట్ రూ. 565
అరవింద్- బై రూ. 581, స్టాప్ లాస్ రూ. 555, టార్గెట్ రూ. 625
{{/usCountry}}అరవింద్- బై రూ. 581, స్టాప్ లాస్ రూ. 555, టార్గెట్ రూ. 625
{{/usCountry}}సీసీఎల్ ప్రాడక్ట్స్- బై రూ. 1131, స్టాప్ లాస్ రూ. 1086, టార్గెట్ రూ. 1210
హెచ్‌బీఎల్ ఇంజనీరింగ్- బై రూ. 731, స్టాప్ లాస్ రూ. 698, టార్గెట్ రూ. 790
ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్- బై రూ. 563, స్టాప్ లాస్ రూ. 545, టార్గెట్ రూ. 600