సోమవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 383 పాయింట్లు పడి 76,132 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 118 పాయింట్లు కోల్పోయి 23,7799 వద్ద సెషన్ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ మాత్రం 281 పాయింట్లు పడి 57,088 వద్దకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 280.13 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 566.76 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక మంగళవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 80 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
సోమవారం ట్రేడింగ్ సెషన్ని అమెరికా స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ముగించాయి. డౌ జోన్స్ 0.51 శాతం పతనమైంది. ఎస్ అండ్ పీ 500 0.38శాతం పడింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.29 శాతం డౌన్ అయ్యింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్ సెషన్లో ఫ్లాట్గా కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధర..
అంతర్జాతీయ అనిశ్చితి కారణంగా ముడి చమురు ధర పెరుగుతూనే ఉంది. మంగళవారం ట్రేడింగ్ సెషన్లో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు 97 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
స్టాక్స్ టు బై..
రెడింగ్టన్- బై రూ. 378, స్టాప్ లాస్ రూ. 364, టార్గెట్ రూ. 405
పిరామల్ ఫార్మా- బై రూ. 219.6, స్టాప్ లాస్ రూ. 212, టార్గెట్ రూ. 235
{{/usCountry}}పిరామల్ ఫార్మా- బై రూ. 219.6, స్టాప్ లాస్ రూ. 212, టార్గెట్ రూ. 235
{{/usCountry}}కోల్ ఇండియా - బై రూ. 417, స్టాప్ లాస్ రూ. 410, టార్గెట్ రూ. 430
గెయిల్- బై రూ. 174, స్టాప్ లాస్ రూ. 170, టార్గెట్ రూ. 181
లారస్ ల్యాబ్స్- బై రూ. 1875, స్టాప్ లాస్ రూ. 1840, టార్గెట్ రూ. 1920
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
కిరి ఇండస్ట్రీస్- బై రూ. 583, స్టాప్ లాస్ రూ. 555, టార్గెట్ రూ. 635
గుజరాత్ థెమిస్ బయోసిన్- బై రూ. 429, స్టాప్ లాస్ రూ. 405, టార్గెట్ రూ. 465
సుప్రీం పెట్రోకెమ్- బై రూ. 802, స్టాప్ లాస్ రూ. 755, టార్గెట్ రూ. 870
మాన్ ఇండస్ట్రీస్- బై రూ. 819, స్టాప్ లాస్ రూ. 775, టార్గెట్ రూ. 885
ఎయిరోఫ్లెక్స్ ఇండస్ట్రీస్- బై రూ. 558, స్టాప్ లాస్ రూ. 600, టార్గెట్ రూ. 527