...
...
Next Story

Stock market : ట్రేడర్స్​ అలర్ట్- ఈ 5 బ్రేకౌట్ స్టాక్స్​తో లాభాలకు ఛాన్స్!

Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ని ఇక్కడ తెలుసుకోండి..

Published on: Jul 3, 2026, 08:14:33 IST
Advertisement

గురువారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 579 పాయింట్లు పెరిగి 77,502 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 170 పాయింట్లు వృద్ధిచెంది 24,176 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ మాత్రం 1 పాయింట్ పడి 58,032 వద్దకు చేరింది.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

స్టాక్ మార్కెట్ అప్డేట్స్..
స్టాక్ మార్కెట్ అప్డేట్స్..

గురువారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 311.82 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1,784.40 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 182 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

గురువారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. డౌ జోన్స్​ 1.1 శాతం పెరిగింది. ఎస్​ అండ్​ పీ 500​ 0.01 శాతం పెరిగింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 0.8 శాతం డౌన్​ అయ్యింది.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు బుధవారం ట్రేడింగ్​ సెషన్​లో నష్టాల్లో కొనసాగుతున్నాయి.

ముడి చమురు ధర..

అంతర్జాతీయ మార్కెట్​లో ముడి చమురు ధరలు మరింత పతనమయ్యాయి. బ్రెంట్​ క్రూడ్ 0.31శాతం పడి బ్యారెల్​కి 71.58 డాలర్లకు చేరింది.

బ్రేకౌట్ స్టాక్స్​ టు బై..

ఎన్​ఐఐటీ- బై రూ. 104.6, స్టాప్​ లాస్​ రూ. 98.7, టార్గెట్​ రూ. 114

డీసీబీ బ్యాంక్- బై రూ. 193.5, స్టాప్​ లాస్​ రూ. 184, టార్గెట్​ రూ. 210

దీపక్ ఫర్టిలైజర్స్ అండ్ పెట్రోకెమికల్స్ కార్పొరేషన్- బై రూ. 1664, స్టాప్​ లాస్​ రూ. 1600, టార్గెట్​ రూ. 1777

పాలీ మెడిక్యూర్- బై రూ. 1732, స్టాప్​ లాస్​ రూ. 1643, టార్గెట్​ రూ. 1860

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe