మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 252 పాయింట్లు పడి 77,018 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 86 పాయింట్లు కోల్పోయి 24,033 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 331 పాయింట్లు పడి 54,547 వద్దకు చేరింది.

కాగా ఇరాన్‌తో యుద్ధాన్ని ముగించేందుకు త్వరలోనే శాంచి ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంకేతాలివ్వడంతో బుధవారం ప్రపంచ స్టాక్ మార్కెట్లు లాభాల బాటపట్టాయి.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
మంగళవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 3,621.58 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2,602.62 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక బుధవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 200 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
“టెక్నికల్‌గా చూసుకుంటే నిఫ్టీ50కి 23,850- 23,900 లెవల్స్ వద్ద కీలక సపోర్ట్ ఉంది. 24,300 వద్ద రెసిస్టెన్స్ ఉంది. అది దాటితే పైకి వెళ్లొచ్చు," అని స్టాక్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగించాయి. డౌ జోన్స్ 0.73 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 0.81శాతం వృద్ధిచెందింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 1.03 శాతం పెరిగింది.s
ఆసియా స్టాక్ మార్కెట్లు బుధవారం ట్రేడింగ్ సెషన్లో లాభాల్లో కొనసాగుతున్నాయి.
చమురు ధర..
{{/usCountry}}ఆసియా స్టాక్ మార్కెట్లు బుధవారం ట్రేడింగ్ సెషన్లో లాభాల్లో కొనసాగుతున్నాయి.
చమురు ధర..
{{/usCountry}}ఇరాన్‌తో అమెరికా చర్చల సంకేతాల నేపథ్యంలో ముడి చమురు ధర పడింది. బ్రెంట్ క్రూడ్ 1.38శాతం పడి బ్యారెల్‌కు 108.35 డాలర్లకు చేరింది.
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
మనోరమా ఇండస్ట్రీస్- బై రూ. 1594, స్టాప్ లాస్ రూ. 1515, టార్గెట్ రూ. 1715
ఆదిత్య బిర్లా క్యాపిటల్- బై రూ. 360, స్టాప్ లాస్ రూ. 346, టార్గెట్ రూ. 390
అపొలో మైక్రో సిస్టెమ్స్- బై రూ. 308, స్టాప్ లాస్ రూ. 294, టార్గెట్ రూ. 330
సైర్మా సీజీఎస్ టెక్నాలజీ- బై రూ. 1058, స్టాప్ లాస్ రూ. 1015, టార్గెట్ రూ. 1150
గ్రావిటా ఇండియా లిమిటెడ్- బై రూ. 1722, స్టాప్ లాస్ రూ. 1655, టార్గెట్ రూ. 1870