అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వస్తున్న ప్రతికూల సంకేతాల నడుమ నేడు (అక్టోబర్ 7, బుధవారం) భారత స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాలతో ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీలో లావాదేవీలవుతున్న గిఫ్ట్ నిఫ్టీ (GIFT Nifty) ఉదయం పూట దాదాపు 35 పాయింట్ల నష్టంతో 22,760.50 స్థాయి వద్ద ట్రేడవుతూ, మన సూచీలకు నెగెటివ్ ఓపెనింగ్‌ను సూచిస్తోంది.

మంగళవారం ట్రేడింగ్‌లో దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు భారీ లాభాలను నమోదు చేశాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడాయిల్ ధరలు బారెల్‌కు 100 డాలర్ల కంటే కిందకు దిగిరావడం, బ్యాంకింగ్ షేర్లతో పాటు రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో కొనుగోళ్ల మద్దతు మార్కెట్లను పరుగులు తీయించింది. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ బీఎస్ఈ సెన్సెక్స్ 685.34 పాయింట్లు (0.95%) పెరిగి 73,067.81 వద్ద స్థిరపడింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ ఎన్ఎస్ఈ నిఫ్టీ 220.35 పాయింట్లు (0.98%) లాభపడి 22,776.10 వద్ద ముగిసింది.
"ఇండియా వీఐఎక్స్ (India VIX) ఏకంగా 7.9 శాతం పడిపోవడం, చమురు ధరలు తగ్గడం మార్కెట్లకు బాగా కలిసి వచ్చింది. రూపాయి క్షీణత కొనసాగుతూ డాలర్‌తో పోలిస్తే 27 పైసలు తగ్గి 96.56 వద్దకు చేరడం కొంత ఆందోళన కలిగిస్తోంది" అని బజాజ్ బ్రోకింగ్ రీసెర్చ్ డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ పవిత్రో ముఖర్జీ వెల్లడించారు.
సెన్సెక్స్, నిఫ్టీ నేటి అంచనాలు
సాంకేతిక విశ్లేషణ ప్రకారం సెన్సెక్స్ షార్ట్ టర్మ్ నిర్మాణం మెరుగైంది. "సెన్సెక్స్ 73,000 స్థాయి పైన స్థిరపడితే కొనుగోళ్ల వేగం పెరిగి 73,400 నుంచి 73,500 స్థాయిల వరకు వెళ్లే అవకాశం ఉంది. ఒకవేళ 72,500 మద్దతు స్థాయిని నిలబెట్టుకోలేకపోతే సూచీ కొంతకాలం కన్సాలిడేషన్‌కు గురికావచ్చు" అని ఛాయిస్ ఈక్విటీ బ్రోకింగ్ వైస్ ప్రెసిడెంట్ సచిన్ గుప్తా వివరించారు.
మరోవైపు నిఫ్టీ 22,600 నిరోధక స్థాయిని దాటి కీలకమైన 22,800 స్థాయికి చేరువగా ముగిసింది. "నిఫ్టీ 22,600 పైన ఉన్నంత వరకు మార్కెట్ సెంటిమెంట్ సానుకూలంగానే ఉంటుంది. సూచీకి 22,850 వద్ద బలమైన నిరోధం ఉంది. ఈ స్థాయిని దాటితే మరింత రికవరీ ఉంటుంది, లేనిపక్షంలో లాభాల స్వీకరణతో మార్కెట్ స్వల్పంగా దిగిరావచ్చు" అని ఎల్కేపీ సెక్యూరిటీస్ సీనియర్ టెక్నికల్ అనలిస్ట్ రూపక్ డే తెలిపారు.
అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం
{{/usCountry}}మరోవైపు నిఫ్టీ 22,600 నిరోధక స్థాయిని దాటి కీలకమైన 22,800 స్థాయికి చేరువగా ముగిసింది. "నిఫ్టీ 22,600 పైన ఉన్నంత వరకు మార్కెట్ సెంటిమెంట్ సానుకూలంగానే ఉంటుంది. సూచీకి 22,850 వద్ద బలమైన నిరోధం ఉంది. ఈ స్థాయిని దాటితే మరింత రికవరీ ఉంటుంది, లేనిపక్షంలో లాభాల స్వీకరణతో మార్కెట్ స్వల్పంగా దిగిరావచ్చు" అని ఎల్కేపీ సెక్యూరిటీస్ సీనియర్ టెక్నికల్ అనలిస్ట్ రూపక్ డే తెలిపారు.
అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం
{{/usCountry}}అమెరికా మార్కెట్లు మంగళవారం సెషన్‌లో రికార్డు లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 500 సూచీ మొదటిసారిగా 7,800 మార్కును దాటగా, నాస్‌డాక్ కూడా ఆల్‌టైమ్ హై నమోదు చేసింది. డో జోన్స్ 253.14 పాయింట్లు లాభపడి 51,521.04 వద్ద ముగిసింది.
ఆసియా మార్కెట్లలో భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. జపాన్ నిక్కీ స్వల్ప లాభాల్లో ఉండగా, దక్షిణ కొరియా కోస్పీ సూచీ టెక్నాలజీ షేర్ల అమ్మకాల వల్ల 1.11 శాతం మేర పడిపోయి 6,864.25 వద్ద ట్రేడవుతోంది. తైవాన్ సూచీ 0.23 శాతం పెరిగింది. ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలు నేడు వెలువడనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు వేచి చూసే ధోరణి అవలంబించే అవకాశముంది.