బుధవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 188 పాయింట్లు పడి 77,966 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 36 పాయింట్లు కోల్పోయి 24,436 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ మాత్రం 4 పాయింట్లు పెరిగి 57,886 వద్దకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
బుధవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 1,002.50 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 5,841.66 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక గురువారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ స్వల్ప నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 50 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
“24,400 ఎగువన నిఫ్టీ50 ఉన్నంత వరకు రికవరీ జరుగుతున్నట్టే. 24,500- 24,550 బ్రేక్ అయితే, సూచీ మరింత పెరగొచ్చు,” అని చాయిస్ బ్రోకింగ్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ సుమీత్ బగాడియా తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
బుధవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. డౌ జోన్స్ 0.04 శాతం పతనమైంది. ఎస్ అండ్ పీ 500 0.3శాతం పెరిగింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.5 శాతం వృద్ధిచెందింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు గురువారం ట్రేడింగ్ సెషన్లో లాభాల్లో కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధర..
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర పడుతోంది. గురువారం ట్రేడింగ్ సెషన్లో బ్రెంట్ క్రూడ్ 1.5శాతం పడి బ్యారెల్‌కి 87.6 డాలర్లకు చేరింది.
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
బర్జర్ పెయింట్స్ ఇండియా- బై రూ. 558, స్టాప్ లాస్ రూ. 533, టార్గెట్ రూ. 600
{{/usCountry}}బర్జర్ పెయింట్స్ ఇండియా- బై రూ. 558, స్టాప్ లాస్ రూ. 533, టార్గెట్ రూ. 600
{{/usCountry}}ఎలక్ట్రానిక్స్ మార్ట్ ఇండియా- బై రూ. 193.6, స్టాప్ లాస్ రూ. 183, టార్గెట్ రూ. 210
ఇండో బోరాక్స్ అండ్ కెమికల్స్- బై రూ. 449, స్టాప్ లాస్ రూ. 425, టార్గెట్ రూ. 490
కేఆర్ఎన్ హీట్ ఎక్స్ఛేంజ్ అండ్ రిఫ్రిజరేషన్- బై రూ. 1332, స్టాప్ లాస్ రూ. 1260, టార్గెట్ రూ. 1414
హెచ్ఎఫ్సీఎల్- బై రూ. 221.5, స్టాప్ లాస్ రూ. 209, టార్గెట్ రూ. 240