...
...
Next Story

Stock market news : ట్రేడర్స్ అలర్ట్- ఈ రూ. 304 స్టాక్​తో లాభాలకు ఛాన్స్!

Stocks to buy today : మే 19, 2026 ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై, బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ని ఇక్కడ తెలుసుకోండి..

Published on: May 19, 2026, 08:14:31 IST
Advertisement

సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 77 పాయింట్లు పెరిగి 75,315 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 6 పాయింట్లు పెరిగి 23,650 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ మాత్రం 173 పాయింట్లు పడి 53,537 వద్దకు చేరింది.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

స్టాక్ మార్కెట్​ లేటెస్ట్ అప్డేట్స్..
స్టాక్ మార్కెట్​ లేటెస్ట్ అప్డేట్స్..

మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 2,813.69 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2,682.12 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ ఫ్లాట్​గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 16 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. డౌ జోన్స్​ 0.32 శాతం పెరిగింది. ఎస్​ అండ్​ పీ 500​ 0.07శాతం పడింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 0.51 శాతం పెరిగింది.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో ఫ్లాట్​గా కొనసాగుతున్నాయి.

ముడి చమురు ధర..

ఇరాన్​పై దాడులను ఆపేస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ప్రకటించడంతో ముడి చమురు ధరలు పడ్డాయి. బ్రెంట్​ క్రూడ్ 2శాతం పడి బ్యారెల్​కు 109.58 డాలర్లకు చేరింది.

స్టాక్స్​ టు బై..

ఏంజిల్ వన్- బై రూ. 304, స్టాప్​ లాస్​ రూ. 298, టార్గెట్​ రూ. 320

ఏబీబీ ఇండియా- బై రూ. 6400, స్టాప్​ లాస్​ రూ. 6200, టార్గెట్​ రూ. 5700

బ్రేకౌట్ స్టాక్స్ టు బై..

నాలెడ్జ్ మెరైన్ అండ్ ఇంజినీరింగ్ వర్క్స్- బై రూ. 2065, స్టాప్​ లాస్​ రూ. 1948, టార్గెట్​ రూ. 2250

షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్​ ఇండియా - బై రూ. 344, స్టాప్​ లాస్​ రూ. 325, టార్గెట్​ రూ. 370

పీబీ ఫిన్​టెక్- బై రూ. 1748, స్టాప్​ లాస్​ రూ. 1650, టార్గెట్​ రూ. 1900

కింగ్​ఫా సైన్స్ అండ్​ టెక్నాలజీ ఇండియా - బై రూ. 5303, స్టాప్​ లాస్​ రూ. 5035, టార్గెట్​ రూ. 5700

డా. లాల్ పాత్ ల్యాబ్స్- బై రూ. 1646, స్టాప్​ లాస్​ రూ. 1575, టార్గెట్​ రూ. 1777

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe