బుధవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 889 పాయింట్లు పెరిగి 77,655 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 265 పాయింట్లు వృద్ధిచెంది 24,250 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 450 పాయింట్లు పెరిగి 57,206 వద్దకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
బుధవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 2,981.87 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 998.02 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక గురువారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ ఫ్లాట్‌గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 20 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
బుధవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగించాయి. డౌ జోన్స్ 2.19 శాతం పతనమైంది. ఎస్ అండ్ పీ 500 1.52శాతం పడింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 1.74 శాతం డౌన్ అయ్యింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు గురువారం ట్రేడింగ్ సెషన్లో ఫ్లాట్‌గా కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధర..
అంతర్జాతీయంగా అనిశ్చితులు కొనసాగుతున్నప్పటికీ.. ముడి చమురు ధర పడుతోంది. గురువారం ట్రేడింగ్ సెషన్లో బ్రెంట్ క్రూడ్ 1.42శాతం పడి బ్యారెల్‌కి 89.45 డాలర్లకు చేరింది.
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
గ్లాండ్ ఫార్మా- బై రూ. 2544, స్టాప్ లాస్ రూ. 2434, టార్గెట్ రూ. 2720
పీజీ ఎలక్ట్రోప్లాస్ట్- బై రూ. 612, స్టాప్ లాస్ రూ. 583, టార్గెట్ రూ. 650
{{/usCountry}}పీజీ ఎలక్ట్రోప్లాస్ట్- బై రూ. 612, స్టాప్ లాస్ రూ. 583, టార్గెట్ రూ. 650
{{/usCountry}}మోరెపెన్ లాబ్స్- బై రూ. 57.8, స్టాప్ లాస్ రూ. 55, టార్గెట్ రూ. 61.5
అలైడ్ బ్లెండర్స్ అండ్ డిస్టిలర్స్- బై రూ. 645, స్టాప్ లాస్ రూ. 610, టార్గెట్ రూ. 690
హెక్సావేర్ టెక్నాలజీస్- బై రూ. 618, స్టాప్ లాస్ రూ. 582, టార్గెట్ రూ. 670