...
...
Next Story

Stock market today : మళ్లీ పెరిగి చమురు ధరలు- ఈ రోజు స్టాక్​ మార్కెట్​లకు లాభాలా? నష్టాలా?

Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ని ఇక్కడ తెలుసుకోండి..

Published on: Mar 17, 2026, 08:15:33 IST
Advertisement

ఇరాన్​- ఇజ్రాయెల్​, యూఎస్​ అనిశ్చితి మధ్య గత వారం అత్యంత భారీగా పతనమైన దేశీయ స్టాక్​ మార్కెట్​లు సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో కాస్త తేరుకున్నాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 939 పాయింట్లు పెరిగి 75,503 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 258 పాయింట్లు వృద్ధిచెంది 23,409 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 656 పాయింట్లు పెరిగి 54,413 వద్దకు చేరింది.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

స్టాక్​ మార్కెట్​ లేటెస్ట్​ అప్డేట్స్​..
స్టాక్​ మార్కెట్​ లేటెస్ట్​ అప్డేట్స్​..

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 9,365.52 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 12,593.36 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈ మార్చ్​​​​ నెలలో ఎఫ్​ఐఐలు ఇప్పటివరకు మొత్తం మీద రూ. 66,248.74 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 83,120.06 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 75 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

అని ఎల్​కేపీ సెక్యూరిటీస్​కి చెందిన సీనియర్​ టెక్నికల్​ రీసెర్చ్​ ఎనలిస్ట్​ రూపక్​ దే తెలిపారు.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు లాభాల్లో ముగించాయి. డౌ జోన్స్​ 0.183శాతం పెరిగింది. ఎస్​ అండ్​ పీ 500​ 1.01శాతం వృద్ధిచెందింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 1.22 శాతం పెరిగింది.

“నిఫ్టీ50కి 23,250- 23,300 లెవల్స్​ కీలక సపోర్ట్​గా ఉంటాయి. 23,550- 23,600 వద్ద రెసిస్టెన్స్​ ఉంది. ఆర్​ఎస్​ఐ అనేది ఓవర్​సోల్డ్​ నుంచి రికవరీ అవుతోంది. ఇంకా రికవర్​ అయితే, సూచీలో బలాన్ని చూడవచ్చు,” అని చాయిస్​ బ్రోకింగ్​కి చెందిన ఎగ్జిక్యూటివ్​ డైరక్టర్​ సుమీత్​ బగాడియా తెలిపారు.

ముడి చమురు ధరలు ఇలా..

అక్యుటాస్​ కెమికల్స్​- బై రూ. 2165, స్టాప్​ లాస్​ రూ. 2090, టార్గెట్​ రూ. 2315

ఏథర్​ ఇండస్ట్రీస్​- బై రూ. 713, స్టాప్​ లాస్​ రూ. 688, టార్గెట్​ రూ. 765

సాయి లైఫ్​ సైన్సెస్​- బై రూ. 976, స్టాప్​ లాస్​ రూ. 940, టార్గెట్​ రూ. 1050

కిర్లోస్కర్​ ఆయిల్​ ఇంజిన్స్​- బై రూ. 1470, స్టాప్​ లాస్​ రూ. 1420, టార్గెట్​ రూ. 1570

సీసీఎల్​ ప్రాడక్ట్స్​ ఇండియా- బై రూ. 1043, స్టాప్​ లాస్​ రూ. 1005, టార్గెట్​ రూ. 1120

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe