సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 47 పాయింట్లు పెరిగి 77,616 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 4 పాయింట్లు వృద్ధిచెంది 24,211 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 86 పాయింట్లు పెరిగి 58,132 వద్దకు చేరింది.

ముడి చమురు ధర నెల రోజుల గరిష్ఠానికి చేరడంతో ప్రపంచ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లలో భయాందోళనలు నెలకొన్నాయి. ఫలితంగా సూచీలు పడుతున్నాయి.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 3,062.27 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2,171.70 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 170 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
అంతర్జాతీయ అనిశ్చితుల కారణంగా బిగినర్లు ట్రేడింగ్‌కి దూరంగా ఉండటం ఉత్తమం అని స్టాక్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ముగించాయి. డౌ జోన్స్ 0.26 శాతం పతనమైంది. ఎస్ అండ్ పీ 500 0.79శాతం పడింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 1.55 శాతం డౌన్ అయ్యింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్ సెషన్లో ఫ్లాట్‌గా కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధర..
అమెరికా- ఇరాన్ తాజా అనిశ్చితుల కారణంగా ముడి చమురు ధర భగ్గుమంది. బ్రెంట్ క్రూడ్ 2శాతం పెరిగి బ్యారెల్‌కి 84.98 డాలర్లకు చేరింది.
స్టాక్స్ టు బై..
{{/usCountry}}అమెరికా- ఇరాన్ తాజా అనిశ్చితుల కారణంగా ముడి చమురు ధర భగ్గుమంది. బ్రెంట్ క్రూడ్ 2శాతం పెరిగి బ్యారెల్‌కి 84.98 డాలర్లకు చేరింది.
స్టాక్స్ టు బై..
{{/usCountry}}యూపీఎల్- బై రూ. 592, స్టాప్ లాస్ రూ. 585, టార్గెట్ రూ. 610
కర్ణాటక బ్యాంక్- బై రూ. 279, స్టాప్ లాస్ రూ. 275, టార్గెట్ రూ. 288
ఎన్టీపీసీ- బై రూ. 350, స్టాప్ లాస్ రూ. 344, టార్గెట్ రూ. 360
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
వెల్స్పన్ లివింగ్- బై రూ. 174, స్టాప్ లాస్ రూ. 163.5, టార్గెట్ రూ. 188
పీసీబీఎల్ కెమికల్- బై రూ. 323.5, స్టాప్ లాస్ రూ. 310, టార్గెట్ రూ. 350
టార్సన్స్ ప్రాడక్ట్స్- బై రూ. 316, స్టాప్ లాస్ రూ. 300, టార్గెట్ రూ. 340
సారేగామా ఇండియా- బై రూ. 498, స్టాప్ లాస్ రూ. 470, టార్గెట్ రూ. 540
నియోజెన్ కెమికల్స్- బై రూ. 2150, స్టాప్ లాస్ రూ. 2040, టార్గెట్ రూ. 2323