శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 965 పాయింట్లు పెరిగి 78,151 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 262 పాయింట్లు వృద్ధిచెంది 24,334 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 939 పాయింట్లు పెరిగి 58,521 వద్దకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..

శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 376.41 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1,017.89 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ ఫ్లాట్‌గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 30 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
మార్కెట్లు పెరుగుతన్నప్పటికీ, అంతర్జాతీయ అనిశ్చితులు కొనసాగుతున్నాయని, ట్రేడర్లు- మరీ ముఖ్యంగా బిగినర్లు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగించాయి. డౌ జోన్స్ 0.77 శాతం పతనమైంది. ఎస్ అండ్ పీ 500 1.05శాతం పడింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 1.4 శాతం డౌన్ అయ్యింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఫ్లాట్‌గా కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధర..
అమెరికా- ఇరాన్ పరస్పర దాడుల నేపథ్యంలో ముడి చమురు ధర పెరుగుతూనే ఉంది. సోమవారం ట్రేడింగ్ సెషన్లో బ్రెంట్ క్రూడ్ 2.71 శాతం పెరిగి బ్యారెల్‌కి 90.49 డాలర్లకు చేరింది.
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
వైభవ్ గ్లోబల్- బై రూ. 262, స్టాప్ లాస్ రూ. 245, టార్గెట్ రూ. 285
{{/usCountry}}వైభవ్ గ్లోబల్- బై రూ. 262, స్టాప్ లాస్ రూ. 245, టార్గెట్ రూ. 285
{{/usCountry}}భారత్ ఫోర్జ్- బై రూ. 2190, స్టాప్ లాస్ రూ. 2100, టార్గెట్ రూ. 2350
ఏజిస్ లాజిస్టిక్స్- బై రూ. 1349, స్టాప్ లాస్ రూ. 1265, టార్గెట్ రూ. 1450
ఇండో బోరాక్స్ అండ్ కెమికల్స్- బై రూ. 466, స్టాప్ లాస్ రూ. 442, టార్గెట్ రూ. 500
ఎగ్సైడ్ ఇండస్ట్రీస్- బై రూ. 435, స్టాప్ లాస్ రూ. 415, టార్గెట్ రూ. 460