...
...
Next Story

Stock market : 95 డాలర్లు తాకిన ముడి చమురు ధర! ఈరోజు స్టాక్ మార్కెట్​లకు నష్టాలే?

Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​, ముడి చమురు ధర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Jul 23, 2026, 08:14:14 IST
Advertisement

అంతర్జాతీయ అనిశ్చితుల కారణంగా బుధవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు నష్టాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 715 పాయింట్లు పడి 76,755 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 191 పాయింట్లు కోల్పోయి 23,996 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 709 పాయింట్లు పడి 57,127 వద్దకు చేరింది.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

స్టాక్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్స్..
స్టాక్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్స్..

బుధవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 819.20 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 418.26 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక గురువారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 105 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

అని హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్​కి చెందిన సీనియర్​ టెక్నికల్​ రీసెర్చ్​ ఎనలిస్ట్​ నాగరాజ్​ శెట్టి తెలిపారు.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

బుధవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. డౌ జోన్స్​ 0.01 శాతం పతనమైంది. ఎస్​ అండ్​ పీ 500​ 0.14శాతం పడింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 0.57 శాతం డౌన్​ అయ్యింది.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు గురువారం ట్రేడింగ్​ సెషన్​లో లాభాల్లో కొనసాగుతున్నాయి.

ముడి చమురు ధర..

అమెరికా- ఇరాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా ముడి చమురు ధర అంతకంతకూ పెరిగిపోతోంది. గురువారం ట్రేడింగ్​ సెషన్​లో బ్రెంట్ క్రూడ్ 1.58శాతం పెరిగి బ్యారెల్​కి 95.5 డాలర్లకు చేరింది.

స్టాక్స్​ టు బై..

గాంధార్ ఆయిల్ రిఫైనరీ ఇండియా- బై రూ. 236, స్టాప్​ లాస్​ రూ. 222, టార్గెట్​ రూ. 255

పాలీప్లెక్స్ కార్ప్- బై రూ. 1115, స్టాప్​ లాస్​ రూ. 1050, టార్గెట్​ రూ. 1200

డివ్గీ టార్క్ ట్రాన్స్​ఫర్ సిస్టెమ్స్- బై రూ. 950, స్టాప్​ లాస్​ రూ. 900, టార్గెట్​ రూ. 1025

ఏజిస్ లాజిస్టిక్స్- బై రూ. 1351, స్టాప్​ లాస్​ రూ. 1290, టార్గెట్​ రూ. 1450

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe