Stock market : ఈరోజు స్టాక్​ మార్కెట్​లకు భారీ లాభాలు- ఈ స్టాక్స్​తో మీకు కూడా ప్రాఫిట్స్​..!

Stocks to buy : మార్చ్​ 24, 2026 ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ని ఇక్కడ తెలుసుకోండి..

Published on: Mar 24, 2026, 08:15:25 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఇరాన్​- ఇజ్రాయెల్​, అమెరికా మధ్య ఉద్రిక్తతల వేళ సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు భారీ నష్టాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 1,837 పాయింట్లు పడి 72,696 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 602 పాయింట్లు కోల్పోయి 22,513 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 1989 పాయింట్లు పడి 51,438 వద్దకు చేరింది.

స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​..
స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​..

అయితే, మార్కెట్​లు ముగిసిన తర్వాత, ఇరాన్​తో చర్చలు జరుగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ప్రకటించడంతో యుద్ధం ముగింపుపై ప్రపంచవ్యాప్తంగా ఆశలు మొదలయ్యాయి. ఇది ప్రపంచ స్టాక్​ మార్కెట్​లకు అత్యంత సానుకూలంగా మారింది.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 9,665.00 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 11,353.60 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ భారీ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 400 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

“ఇక్కడి నుంచి నిఫ్టీ50 కిందకు పడితే 22000-21800 లెవల్స్​ వరకు వెళ్లొచ్చు. 22,700- 22,800 లెవల్స్​ వద్ద కీలక రెసిస్టెన్స్​ ఉంది,” అని హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్​కి చెందిన సీనియర్​ టెక్నికల్​ రీసెర్చ్​ ఎనలిస్ట్​ నాగరాజ్​ శెట్టి తెలిపారు.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు లాభాల్లో ముగించాయి. డౌ జోన్స్​ 1.38 శాతం పెరిగింది. ఎస్​ అండ్​ పీ 500​ 1.15శాతం వృద్ధిచెందింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 1.38 శాతం పెరిగింది.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. జపాన్​ నిక్కీ 2.2శాతం మేర లాభాల్లో దూసుకెళుతోంది.

బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై..

గుజరాత్​ మినరల్​ డెవలప్​మెంట్​ కార్పొరేషన్​- బై రూ. 562.3, స్టాప్​ లాస్​ రూ. 538, టార్గెట్​ రూ. 615

సన్​ టీవీ నెట్​వర్క్​- బై రూ. 599.10, స్టాప్​ లాస్​ రూ. 575, టార్గెట్​ రూ. 640

గుజరాత్​ ఫ్లోరోకెమికల్స్​- బై రూ. 3248.2, స్టాప్​ లాస్​ రూ. 3130, టార్గెట్​ రూ. 3440

ప్రీమియర్​ ఎనర్జీస్​- బై రూ. 868.55, స్టాప్​ లాస్​ రూ. 827, టార్గెట్​ రూ. 950

టెక్​ మహీంద్రా- బై రూ. 1384, స్టాప్​ లాస్​ రూ. 1330, టార్గెట్​ రూ. 1500

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More