సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 508 పాయింట్లు పడి 74,267 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 165 పాయింట్లు కోల్పోయి 23,383 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 596 పాయింట్లు పడి 53,643 వద్దకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..

సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 3,911.68 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 5,109.13 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 215 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
“భారత స్టాక్ మార్కెట్లు షార్ట్ టర్మ్‌లో రేంజ్ బౌండ్ నుంచి నెగిటివ్‌గా ఉండొచ్చు. ఎఫ్ఐఐల అమ్మకాలు, అంతర్జాతీయ అనిశ్చితి ఇందుకు కారణం. ఈ పరిస్థితుల్లో మిడ్‌క్యాప్ స్పేస్‌లో స్టాక్ స్పెసిఫిక్‌గా అవకాశాలను వెతుక్కోవడం ఉత్తమం,” అని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్ ఆఫ్ రీసెర్చ్ సిద్ధార్థ ఖేంక తెలిపారు.
చాయిస్ బ్రోకింగ్‌కి చెందిన ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ సుమీత్ బగాడియా ప్రకారం.. నిఫ్టీ50కి 23,150- 23,200 లెవల్స్ వద్ద సపోర్ట్ ఉంది. 23,480- 23,550 వద్ద రెసిస్టెన్స్ ఉంది.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. డౌ జోన్స్ 0.09 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 0.26శాతం వృద్ధిచెందింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.42 శాతం పెరిగింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్ సెషన్లో నష్టాల్లో కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధర..
{{/usCountry}}ఆసియా స్టాక్ మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్ సెషన్లో నష్టాల్లో కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధర..
{{/usCountry}}అమెరికా- ఇరాన్ మధ్య శాంతి ఒప్పందంపై నెలకొన్న అనిశ్చితి నేపథ్యంలో చమురు ధర ఫ్లాట్‌గా ఉంది. మంగళవారం ట్రేడింగ్ సెషన్లో బ్రెంట్ క్రూడ్ 0.06శాతం పెరిగి 95.04 డాలర్లకు చేరింది.
స్టాక్స్ టు బై టుడే..
ఎన్ఎండీసీ- బై రూ. 92.35, స్టాప్ లాస్ రూ. 90, టార్గెట్ రూ. 96
ఐజీఎల్- బై రూ. 164.50, స్టాప్ లాస్ రూ. 161, టార్గెట్ రూ. 171
కొఫోర్జ్- బై రూ. 1461, స్టాప్ లాస్ రూ. 1430, టార్గెట్ రూ. 1515
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
రేట్‌గెయిన్ ట్రావెల్ టెక్నాలజీస్- బై రూ. 777, స్టాప్ లాస్ రూ. 739, టార్గెట్ రూ. 845
చెన్నై పెట్రోలియం కార్పొరేషన్- బై రూ. 1097, స్టాప్ లాస్ రూ. 1042, టార్గెట్ రూ. 1200
ఎన్బీసీసీ- బై రూ. 104, స్టాప్ లాస్ రూ. 99, టార్గెట్ రూ. 115
రెడింగ్టన్- బై రూ. 233, స్టాప్ లాస్ రూ. 224, టార్గెట్ రూ. 252
ఎల్‌టీఎం- బై రూ. 4196, స్టాప్ లాస్ రూ. 4000, టార్గెట్ రూ. 4550