Stock market : చమురు ధర ఢమాల్- స్టాక్​ మార్కెట్​లకు జోష్.. ఈ స్టాక్స్​తో లాభాలు!

Stocks to buy today : జూన్ 12, 2026 ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై, బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ని ఇక్కడ తెలుసుకోండి.

Published on: Jun 12, 2026, 08:14:16 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గురువారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 151 పాయింట్లు పడి 73,833 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 53 పాయింట్లు కోల్పోయి 23,162 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ మాత్రం 76 పాయింట్లు పెరిగి 55,177 వద్దకు చేరింది.

స్టాక్స్ టు బై టుడే..
స్టాక్స్ టు బై టుడే..

అమెరికా- ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కాస్త తగ్గడం, శాంతి ఒప్పందం కుదిరే అవకాశం ఉందన్న సంకేతాల నేపథ్యంలో శుక్రవారం ప్రపంచ స్టాక్​ మార్కెట్​లు లాభాల్లో ఉన్నాయి.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

గురువారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 1,987.09 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 4,224.51 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ భారీ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 290 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

“నిఫ్టీ50 23,000 బ్రేక్ అయితే మరింత కరెక్షన్ కనిపించవచ్చు. అదే సమయంలో 23,500 లెవల్ వద్ద రెసిస్టెన్స్​ ఉంది. అంతర్జాతీయ అనిశ్చితి కారణంగా ట్రేడర్లు, ఇన్వెస్టర్లు ఆచితూచి, స్టాక్ ఆధారిత అవకాశాల కోసం చూడాలి,” అని రెలిగేర్ బ్రోకింగ్​కి చెందిన ఎస్​వీపీ అజిత్ మిశ్రా తెలిపారు.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

గురువారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు లాభాల్లో ముగించాయి. డౌ జోన్స్​ 1.86 శాతం పెరిగింది. ఎస్​ అండ్​ పీ 500​ 1.75శాతం వృద్ధిచెందింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 2.54 శాతం పెరిగింది.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. జపాన్ నిక్కీ 3.4శాతం పెరిగింది.

ముడి చమురు ధర..

అమెరికా- ఇరాన్ శాంతి ఒప్పందం వార్తల మధ్య ముడి చమురు ధర పతనమైంది. బ్రెంట్​ క్రూడ్ చాలా రోజుల అనంతరం 90 డాలర్ల దిగువకు వచ్చింది. ప్రస్తుతం 1.3శాతం పతనమై బ్యారెల్​కి 89.17 డాలర్లకు చేరింది.

స్టాక్స్​ టు బై..

ఇండియా సిమెంట్స్- బై రూ. 385, స్టాప్​ లాస్​ రూ. 371, టార్గెట్​ రూ. 412

టొరంట్ ఫార్మా- బై రూ. 4572, స్టాప్​ లాస్​ రూ. 4410, టార్గెట్​ రూ. 4890

హెచ్​యూఎల్- బై రూ. 2140, స్టాప్​ లాస్​ రూ. 2080, టార్గెట్​ రూ. 2200

ఎం అండ్​ ఎం- బై రూ. 3005, స్టాప్​ లాస్​ రూ. 2950, టార్గెట్​ రూ. 3120

ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్- బై రూ. 963, స్టాప్​ లాస్​ రూ. 950, టార్గెట్​ రూ. 995

బ్రేకౌట్ స్టాక్స్​ టు బై..

జిందాల్ పాలీ ఫిల్మ్- బై రూ. 732, స్టాప్​ లాస్​ రూ. 689, టార్గెట్​ రూ. 815

ఎస్​ఐఎస్- బై రూ. 429, స్టాప్​ లాస్​ రూ. 407, టార్గెట్​ రూ. 470

అజంత ఫార్మా- బై రూ. 3143, స్టాప్​ లాస్​ రూ. 3000, టార్గెట్​ రూ. 3420

ఐసీఐసీఐ బ్యాంక్- బై రూ. 1317, స్టాప్​ లాస్​ రూ. 1250, టార్గెట్​ రూ. 1430

నియోజెన్ కెమికల్స్- బై రూ. 2029, స్టాప్​ లాస్​ రూ. 1930, టార్గెట్​ రూ. 2200

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More