బుధవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 130 పాయింట్లు పెరిగి 77,185 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 26 పాయింట్లు వృద్ధిచెంది 24,078 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 296 పాయింట్లు పెరిగి 57,758 వద్దకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..

బుధవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 704,93 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 735.83 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక గురువారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ ఫ్లాట్‌గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 40 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
బుధవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. డౌ జోన్స్ 0.29 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 0.38శాతం వృద్ధిచెందింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.62 శాతం పెరిగింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు బుధవారం ట్రేడింగ్ సెషన్లో నష్టాల్లో కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధర..
అమెరికా- ఇరాన్ అనిశ్చితుల మధ్య ముడి చమురు ధర ఎక్కువగానే ఉంది. బ్రెంట్ క్రూడ్ 0.4శాతం పెరిగి బ్యారెల్‌కి 85.28 డాలర్లకు చేరింది.
స్టాక్స్ టు బై..
సీఈఎస్సీ- బై రూ. 162, స్టాప్ లాస్ రూ. 158, టార్గెట్ రూ. 168
వేదాంత- బై రూ. 260, స్టాప్ లాస్ రూ. 266, టార్గెట్ రూ. 250
{{/usCountry}}వేదాంత- బై రూ. 260, స్టాప్ లాస్ రూ. 266, టార్గెట్ రూ. 250
{{/usCountry}}క్రిసిల్- బై రూ. 4190, స్టాప్ లాస్ రూ. 4170, టార్గెట్ రూ. 4260
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
జుబీలియంట్ ఫార్మోవా- బై రూ. 1028, స్టాప్ లాస్ రూ. 977, టార్గెట్ రూ. 1100
తమిళ్నాడ్ మర్చెంటైల్ బ్యాంక్- బై రూ. 816, స్టాప్ లాస్ రూ. 777, టార్గెట్ రూ. 875
చెన్నై పెట్రోలియం- బై రూ. 1157, స్టాప్ లాస్ రూ. 1105, టార్గెట్ రూ. 1250
ఇండిగో పెయింట్స్- బై రూ. 1084, స్టాప్ లాస్ రూ. 1017, టార్గెట్ రూ. 1165
జ్ఞాలెడ్జ్ మెరైన్ అండ్ ఇంజినీరంగ్ వర్క్స్- బై రూ. 2448, స్టాప్ లాస్ రూ. 2330, టార్గెట్ రూ. 2650.