గురువారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 366 పాయింట్లు పడి 76,391 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 127 పాయింట్లు కోల్పోయి 23,870 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 535 పాయింట్లు పడి 56,592 వద్దకు చేరింది.
కాగా.. అమెరికా- ఇరాన్ మధ్య అనిశ్చితులు రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతుండటంతో ప్రపంచ స్టాక్ మార్కెట్లు మళ్లీ నష్టాల బాటపట్టాయి.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
గురువారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 2,999.23 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2,947.14 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 170 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
“నిఫ్టీ50 కిందకు పడుతూనే ఉంది. సూచీ ఇప్పుడు కీలకమైన 23,800 సపోర్ట్‌ని బ్రేక్ చేయ్యకుండా ఉండాలి. అదే కూడా విఫలమైతే.. నిఫ్టీ50 రానున్న సెషన్స్‌లో 23,000కి కూడా పడిపోవచ్చు,” అని ప్రభుదాస్ లిల్లాధేర్కి చెందిన వైస్ ప్రెసిడెంట్ వైశాళి పరేఖ్ తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
గురువారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగించాయి. డౌ జోన్స్ 0.97 శాతం పతనమైంది. ఎస్ అండ్ పీ 500 1.21శాతం పడింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 2.15 శాతం డౌన్ అయ్యింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో నష్టాల్లో కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధర..
{{/usCountry}}ఆసియా స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో నష్టాల్లో కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధర..
{{/usCountry}}పశ్చిమాసియాలో అనిశ్చితుల కారణంగా ముడి చమురు ధర ఈ ఒక్క వారంగా లోనే 13.5శాతం పెరిగింది! ఇక శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో బ్రెంట్ క్రూడ్ ఫ్లాట్‌గా 0.72శాతం పడి బ్యారెల్‌కి 99.97 డాలర్లకు చేరింది.
స్టాక్స్ టు బై..
మాన్ ఇండస్ట్రీస్- బై రూ. 533, స్టాప్ లాస్- రూ. 520, టార్గెట్ రూ. 560
ఎస్టర్ ఇండస్ట్రీస్- బై రూ. 89, స్టాప్ లాస్ రూ. 87.5, టార్గెట్ రూ. 93
ఓరియంట్ ఎలక్ట్రిక్- బై రూ. 174, స్టాప్ లాస్ రూ. 171, టార్గెట్ రూ. 182