Gift nifty live : గురువారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 14 పాయింట్లు పెరిగి 74,360 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. కేవలం 11 పాయింట్లు వృద్ధిచెంది 23,417 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 122 పాయింట్లు పెరిగి 54,308 వద్దకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
గురువారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 4,447.06 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 4,360.14 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ ఫ్లాట్‌గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 20 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్ ఆఫ్ రీసెర్చ్, వెల్త్ మేనేజ్మెంట్ సిద్ధార్థ ఖేంక ప్రకారం.. “భారత స్టాక్ మార్కెట్లు షార్ట్ టర్మ్‌లో రేంజ్ బౌండ్లోనే కొనసాగే అవకాశం ఉంది. కాగా ఈరోజు వెలువడనున్న ఆర్బీఐ ఎంపీసీ మీటింగ్ ఫలితాలపై మదుపర్లు ఫోకస్ చేస్తన్నారు. వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం, జీడీపీపై ఆర్బీఐ గవర్నర్ వ్యాఖ్యలు కీలకంగా మారనున్నాయి.”
ఆర్బీఐ మానిటరీ పాలసీ మీటింగ్‌కి సంబంధించిన ప్రెస్ కాన్ఫరెన్స్ శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రారంభం అవుతుంది.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
గురువారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. డౌ జోన్స్ 1.73 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 0.41శాతం వృద్ధిచెందింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.09 శాతం డౌన్ అయ్యింది.
టెక్ ఇండెక్స్‌ల పతనం కారణంగా ఆసియా స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో భారీ నష్టాలను చూస్తున్నాయి. సౌత్ కొరియాకు చెందిన కాస్పీ ఏకంగా 6శాతం పతనమైంది. జపాన్ నిక్కీ 2శాతం డౌన్ అయ్యింది.
ముడి చమురు ధర..
{{/usCountry}}టెక్ ఇండెక్స్‌ల పతనం కారణంగా ఆసియా స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో భారీ నష్టాలను చూస్తున్నాయి. సౌత్ కొరియాకు చెందిన కాస్పీ ఏకంగా 6శాతం పతనమైంది. జపాన్ నిక్కీ 2శాతం డౌన్ అయ్యింది.
ముడి చమురు ధర..
{{/usCountry}}అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర పెద్దగా మారలేదు. బ్రెంట్ క్రూడ్ 0.22శాతం పడి బ్యారెల్‌కి 95.24 డాలర్లకు చేరింది.
స్టాక్స్ టు బై..
ఐఎంఎఫ్‌ఏ- బై రూ. 1530, స్టాప్ లాస్ రూ. 1510, టార్గెట్ రూ. 1590
ఎన్బీసీసీ- బై రూ. 103, స్టాప్ లాస్ రూ. 100, టార్గెట్ రూ. 108
అనుపమ్ రసాయన్- బై రూ. 1330, స్టాప్ లాస్ రూ. 1305, టార్గెట్ రూ. 1370
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
ఆస్ట్రా మైక్రోవేవ్ ప్రాడక్ట్స్- బై రూ. 1377, స్టాప్ లాస్ రూ. 1313, టార్గెట్ రూ. 1480
బ్లిస్ జీవీఎస్ ఫార్మా- బై రూ. 456, స్టాప్ లాస్ రూ. 430, టార్గెట్ రూ. 499
ఎంటార్ టెక్నాలజీస్- బై రూ. 7755, స్టాప్ లాస్ రూ. 7310, టార్గెట్ రూ. 8450
హొనాసా కన్జ్యూమర్- బై రూ. 417, స్టాప్ లాస్ రూ. 396, టార్గెట్ రూ .450
కృష్ణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్- బై రూ. 765, స్టాప్ లా స్ రూ. 725, టార్గెట్ రూ. 830