...
...
Next Story

Stock market : గిఫ్ట్​ నిఫ్టీ డౌన్- ఈరోజు స్టాక్​ మార్కెట్​లకు భారీ నష్టాలు..

Stocks to buy today : జూన్ 8, 2026 ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై, బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ని ఇక్కడ తెలుసుకోండి..

Published on: Jun 8, 2026, 08:14:52 IST
Advertisement

Gift nifty live : శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 117 పాయింట్లు పడి 74,243 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 50 పాయింట్లు కోల్పోయి 23,367 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ మాత్రం 188 పాయింట్లు పెరిగి 54,496 వద్దకు చేరింది.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

స్టాక్ మార్కెట్​ లేటెస్ట్ అప్డేట్స్...
స్టాక్ మార్కెట్​ లేటెస్ట్ అప్డేట్స్...

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 8,776.25 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 9,133.57 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 300 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

“అంతర్జాతీయ అనిశ్చితి కారణంగా దేశీయ స్టాక్​ మార్కెట్​లు రేంజ్​ బౌండ్​లో కొనసాగే అవకాశం ఉంది. పశ్చిమాసియాలో యుద్ధం, చమురు ధరలు, టెక్​ స్టాక్స్​ పనితీరును ఇన్వెస్టర్లను నిశితంగా పరిశీలిస్తారు,” అని మోతీలాల్ ఓస్వాల్​ ఫైనాన్షియల్​ సర్వీసెస్​కి చెందిన హెడ్​ ఆఫ్​ రీసెర్చ్, వెల్త్​ మేనేజ్​మెంట్​ సిద్ధార్థ ఖేంక తెలిపారు.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

టెక్​ స్టాక్స్​లో ప్రకంపనల నేపథ్యంలో శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు స్వల్ప నష్టాల్లో ముగించాయి. డౌ జోన్స్​ 1.35 శాతం పతనమైంది. ఎస్​ అండ్​ పీ 500​ 2.6శాతం పడింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 4.18 శాతం డౌన్​ అయ్యింది.

అమెరికా సూచీల్లో ప్రకంపనలు ఆసియా స్టాక్​ మార్కెట్​లకు పాకాయి. ఫలితంగా సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో సూచీల్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. జపాన్ నిక్కీ 3.5శాతం, కాస్పీ 8.4శాతం పతనమయ్యాయి.

ముడి చమురు ధర..

గ్రీవ్స్ కాటన్- బై రూ. 192.2, స్టాప్​ లాస్​ రూ. 181, టార్గెట్​ రూ. 205

సారేగామా ఇండియా- బై రూ. 476, స్టాప్​ లాస్​ రూ. 454, టార్గెట్​ రూ. 520

ఎన్​ఆర్​బీ బేరింగ్స్- బై రూ. 385, స్టాప్​ లాస్​ రూ. 270, టార్గెట్​ రూ. 420

అపోలో పైప్స్- బై రూ. 498, స్టాప్​ లాస్​ రూ. 477, టార్గెట్​ రూ. 540

అదానీ ఎనర్జీ సొల్యూషన్స్- బై రూ. 1579, స్టాప్​ లాస్​ రూ. 1525, టార్గెట్​ రూ. 1700

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe