Stock market news : మహారాష్ట్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లకు సెలవు. ఇక గురువారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 583 పాయింట్లు పడి 76,913 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 180 పాయింట్లు కోల్పోయి 23,998 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ మాత్రం 540 పాయింట్లు పడి 54,863 వద్దకు చేరింది.

అమెరికా- ఇరాన్ మధ్య అనిశ్చితితో పాటు దేశంలో నేడు వెలువడనున్న 5 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికల ఫలితాలు.. స్టాక్ మార్కెట్లకు ప్రభావితం చేయనున్నాయి.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
గురువారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 8,047.86 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3,487.10 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 150 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
అని ఎల్కేపీ సెక్యూరిటీస్‌కి చెందిన సీనియర్ టెక్నికల్ రీసెర్చ్ ఎనలిస్ట్ రూపక్ దే తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. డౌ జోన్స్ 0.31 శాతం పతనమైంది. ఎస్ అండ్ పీ 500 0.29శాతం పెరిగింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.89 శాతం వృద్ధి చెందింది.
“దలాల్ స్ట్రీట్ ప్రస్తుతం అప్రమత్తంగా ఉంది. నిఫ్టీ50 23,800- 24,300 మధ్యలో ట్రేడ్ అవుతోంది. బ్రేకౌట్ అయితే అటువైపు డైరక్షన్ని కొనసాగిస్తుంది. రానున్న రోజుల్లో సూచీ ఎటువైపు బ్రేకౌట్ అవుతుందో వేచి చూడాలి,” అని ప్రభుదాస్ లిల్లాధేర్కి చెందిన వైస్ ప్రెసిడెంట్, టెక్నికల్ రీసెర్చ్ వైశాలీ పరేఖ్ తెలిపారు.
ముడి చమురు ధర..
గత వారం బ్యారెల్‌కు 115 డాలర్లు దాటేసిన బ్రెంట్ క్రూడ్ ఇప్పుడు కాస్త కూల్-ఆఫ్ అవుతోంది. సోమవారం ట్రేడింగ్‌లో బ్రెంట్ క్రూడ్ 0.41శాతం పడి, బ్యారెల్‌కి 107.73 డాలర్లకు చేరింది.
{{/usCountry}}గత వారం బ్యారెల్‌కు 115 డాలర్లు దాటేసిన బ్రెంట్ క్రూడ్ ఇప్పుడు కాస్త కూల్-ఆఫ్ అవుతోంది. సోమవారం ట్రేడింగ్‌లో బ్రెంట్ క్రూడ్ 0.41శాతం పడి, బ్యారెల్‌కి 107.73 డాలర్లకు చేరింది.
{{/usCountry}}స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్‌పై అమెరికా- ఇరాన్ వైఖరిపైనే ముడి చమురు ధరలు ఆధారపడి ఉంటాయి.
స్టాక్స్ టు బై..
తిరుమలై కెమికల్స్- బై రూ. 200, స్టాప్ లాస్ రూ. 197, టార్గెట్ రూ. 210
సీఈఎస్సీ- బై రూ. 185, స్టాప్ లాస్ రూ. 180, టార్గెట్ రూ. 195
భారత్ డైనమిక్సి- బై రూ. 1364, స్టాప్ లాస్ రూ. 1346, టార్గెట్ రూ. 1390
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
పాండీ ఆక్సిడెస్ అండ్ కెమికల్స్- బై రూ. 1382, స్టాప్ లాస్ రూ. 1300, టార్గెట్ రూ. 1515
బ్లిస్ జీవీఎస్ ఫార్మా- బై రూ. 276.5, స్టాప్ లాస్ రూ. 265, టార్గెట్ రూ. 300
ఎస్‌జేఎస్ ఎంటర్ప్రైజెస్- బై రూ. 1808.5, స్టాప్ లాస్ రూ. 1705, టార్గెట్ రూ. 1950
భారత్ సీట్స్- బై రూ. 187.2, స్టాప్ లాస్ రూ. 175, టార్గెట్ రూ. 205
రెట్గెయిన్ ట్రావెల్ టెక్నాలజీస్- బై రూ. 602.6, స్టాప్ లాస్ రూ. 575, టార్గెట్ రూ. 660