...
...
Next Story

stocks to buy : ట్రేడర్స్​ అలర్ట్​- ఈ 5 బ్రేకౌట్​ స్టాక్స్​తో లాభాలు!

Stock market updates : మే 12, 2026 ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ని ఇక్కడ తెలుసుకోండి..

Published on: May 12, 2026, 08:14:19 IST
Advertisement

Gift nifty live : సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు నష్టాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 1313 పాయింట్లు పడి 76,015 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 360 పాయింట్లు కోల్పోయి 23,816 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 871 పాయింట్లు పడి 54,440 వద్దకు చేరింది.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్..
స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్..

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 8,438 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 5,940 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 190 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

“నిఫ్టీ50 డైలీ చార్ట్​లో గ్యాప్​ డౌన్​ ఓపెనింగ్​తో కూడిన భారీ బేర్​ క్యాండిల్​ ఏర్పడింది. ఇది నెగిటివ్​ ట్రెండ్​కి సంకేతం. సూచీ ఇప్పుడు 23,800- 24,500 లెవల్స్​ మధ్యలో కదలాడుతోంది. 23,800 నుంచి బౌన్స్​ బ్యాక్​ అయితే నిఫ్టీ50 పైకి వెళ్లొచ్చు. కిందకి బ్రేక్​ అయితే 23,500- 23,200 లెవల్స్​ వరకూ కూడా వెళ్లొచ్చు,” అని హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్​కి చెందిన సీనియర్ టెక్నికల్​ రీసెర్చ్​ ఎనలిస్ట్​ నాగరాజ్​ శెట్టి తెలిపారు.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. డౌ జోన్స్​ 0.19 శాతం పెరిగింది. ఎస్​ అండ్​ పీ 500​ 0.19శాతం వృద్ధిచెందింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 0.10 శాతం పెరిగింది.

ముడి చమురు ధర ఈరోజు ఫ్లాట్​గా ఉంది. బ్రెంట్​ క్రూడ్ 0.29శాతం పెరిగి బ్యారెల్​కి 104.51 డాలర్లకు చేరింది.

బ్రేకౌట్ స్టాక్స్​ టు బై..

ఆక్మే సోలార్ హోల్డింగ్స్- బై రూ. 290, స్టాప్​ లాస్​ రూ. 275, టార్గెట్​ రూ. 313

ఎండ్యూరెన్స్ టెక్నాలజీస్- బై రూ. 2628, స్టాప్​ లాస్​ రూ. 2500, టార్గెట్​ రూ. 2800

నాలేడ్జ్ మెరైన్ అండ్​ ఇంజినీరింగ్​ వర్క్స్- బై రూ. 2197, స్టాప్​ లాస్​ రూ. 2079, టార్గెట్​ రూ. 2350

నారాయణ హృదయాలయ- బై రూ. 1886, స్టాప్​ లాస్​ రూ. 1800, టార్గెట్​ రూ. 2050

జేకే పేపర్- బై రూ. 391, స్టాప్​ లాస్​ రూ. 378, టార్గెట్​ రూ. 420

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe