ట్రేడర్స్​ అలర్ట్​- ఈ రూ. 149 స్టాక్​తో లాభాలకు ఛాన్స్​..

జనవరి 2, ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై, బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ని ఇక్కడ తెలుసుకోండి..

Published on: Jan 2, 2026, 08:15:49 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

2026 మొదటి ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 32 పాయింట్లు పడి 85,187 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 17 పాయింట్లు వృద్ధిచెంది 26,147 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 130 పాయింట్లు పెరిగి 59,712 వద్దకు చేరింది.

స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​..
స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​..

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

గురువారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 3,268.6 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1,525.89 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక బుధవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ ఫ్లాట్​గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 25 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

“నిఫ్టీ50కి 26,250- 26,330 లెవల్స్​ వద్ద బలమైన రెసిస్టెన్స్​ ఉంది. అక్కడ సూచీ కన్సాలిడేట్​ అవ్వొచ్చు. 26,000 వద్ద సపోర్ట్​ ఉంది,​” అని బజాజ్​ బ్రోకింగ్​ నిపుణులు వెల్లడించారు.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

న్యూ ఇయర్​ సందర్భంగా అమెరికా స్టాక్​ మార్కెట్​లకు గురువారం సెలవు.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఫ్లాట్​గా కొనసాగుతున్నాయి.

  • 8వ వేతన సంఘం అమలైతే స్టాక్ మార్కెట్లకు కొత్త ఊపు.. ఏయే రంగాలకు లాభం? పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

స్టాక్స్​ టు బై..

ఇండస్​ టవర్​ లిమిటెడ్​- బై రూ. 436, స్టాప్​ లాస్​ రూ. 420, టార్గెట్​ రూ. 468

జేకే టైర్స్​- బై రూ. 517, స్టాప్​ లాస్​ రూ. 500, టార్గెట్​ రూ. 551

సీజీ పవర్​ అండ్​ ఇండస్ట్రియల్​ సొల్యూషన్స్​ లిమిటెడ్​- బై రూ. 639, స్టాప్​ లాస్​ రూ. 628, టార్గెట్​ రూ. 660

సెయిల్​- బై రూ. 149, స్టాప్​ లాస్​ రూ. 142, టార్గెట్​ రూ. 158

సన్​ ఫార్మా- బై రూ. 1725, స్టాప్​ లాస్​ రూ. 1700, టార్గెట్​ రూ .1770

బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై..

ప్రతాప్​ స్నాక్స్​- బై రూ. 1218, స్టాప్​ లాస్​ రూ. 1170, టార్గెట్​ రూ. 1300

పీఎన్​బీ హౌసింగ్​ ఫైనాన్స్​- బై రూ. 986.60, స్టాప్​ లాస్​ రూ. 950, టార్గెట్​ రూ. 1070

కేఈఐ ఇండస్ట్రీస్​- బై రూ. 4514.5, స్టాప్​ లాస్​ రూ. 4320, టార్గెట్​ రూ. 4900

ఎన్​టీపీసీ- బై రూ. 336.3, స్టాప్​ లాస్​ రూ. 323, టార్గెట్​ రూ. 360

బ్యాంక్​ ఆఫ్​ ఇండియా- బై రూ. 146.99, స్టాప్​ లాస్​ రూ. 140, టార్గెట్​ రూ. 160

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More