మంగళవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 436 పాయింట్లు పడి 84,666 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 121 పాయింట్లు కోల్పోయి 25,840 వద్ద సెషన్ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 16 పాయింట్లు పడి 59,222 వద్దకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
మంగళవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 3760.08 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 6,224.89 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈ నెలలో ఎఫ్ఐఐలు ఇప్పటివరకు మొత్తం మీద రూ. 14,819.29 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 28,552.88 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక బుధవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్ ఫ్లాట్గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 25 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
“నిఫ్టీ50 సూచీ 21ఈఎంఏ దిగువకి పడింది. ఫలితంగా షార్ట్ టర్మ్ ట్రెండ్ నెగివిట్వా మారింది. సూచీ ఇక్కడి నుంచి 25,615- 25,535 వద్దకు చేరొచ్చు. 25,970- 26,000 వద్ద రెసిస్టెన్స్ ఉంది,” అని ఎల్కేపీ సెక్యూరిటీస్కి చెందిన సీనియర్ టెక్నికల్ రీసెర్చ్ ఎనలిస్ట్ రూపక్ దే తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
మంగళవారం ట్రేడింగ్ సెషన్ని అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ముగించాయి. డౌ జోన్స్ 0.38 శాతం పతనమైంది. ఎస్ అండ్ పీ 500 0.09శాతం పడింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.13 శాతం డౌన్ అయ్యింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు బుధవారం ట్రేడింగ్ సెషన్లో లాభాల్లో కొనసాగుతున్నాయి.
స్టాక్స్ టు బై..
{{/usCountry}}ఆసియా స్టాక్ మార్కెట్లు బుధవారం ట్రేడింగ్ సెషన్లో లాభాల్లో కొనసాగుతున్నాయి.
స్టాక్స్ టు బై..
{{/usCountry}}యాప్టస్ వాల్యూ హౌసింగ్ ఫైనాన్స్ ఇండియా- బై రూ. 289, స్టాప్ లాస్ రూ. 279, టార్గెట్ రూ. 309
గుజరాత్ పిపావావ్ పోర్ట్- బై రూ. 189, స్టాప్ లాస్ రూ. 182, టార్గెట్ రూ. 203
గోద్రేజ్ ప్రాపర్టీస్- బై రూ. 2040, స్టాప్ లాస్ రూ. 2000, టార్గెట్ రూ. 2120
ఎస్బీఐ- బై రూ. 960, స్టాప్ లాస్ రూ. 945, టార్గెట్ రూ. 990
ఎన్టీపీసీ- బై రూ. 318, స్టాప్ లాస్ రూ. 315, టార్గెట్ రూ. 330
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
శారదా క్రాప్ కెమ్: రూ .908 వద్ద కొనండి, లక్ష్యం రూ .970, స్టాప్ లాస్ రూ .870;
సంధర్ టెక్నాలజీస్: రూ .560 వద్ద కొనండి, టార్గెట్ రూ .600, స్టాప్ లాస్ రూ .540;
ఇండో బోరాక్స్ అండ్ కెమికల్స్: రూ.260 వద్ద కొనండి, టార్గెట్ రూ.280, స్టాప్ లాస్ రూ.250;
జమ్నా ఆటో ఇండస్ట్రీస్: రూ .122.5 వద్ద కొనండి, టార్గెట్ రూ .132, స్టాప్ లాస్ రూ .118;
ఆశాపురా మైన్ కెమ్: రూ .715 వద్ద కొనండి, లక్ష్యం రూ .765, స్టాప్ లాస్ రూ .688.