Stocks to buy : ట్రేడర్స్ అలర్ట్- ఈ రోజు మీ ఫోకస్ ఏ షేర్లపై ఉండాలో తెలుసా?
ఫిబ్రవరి 10, ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ని ఇక్కడ తెలుసుకోండి..
సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 485 పాయింట్లు పెరిగి 84,066 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 174 పాయింట్లు వృద్ధిచెంది 25,867 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 549 పాయింట్లు పెరిగి 60,669 వద్దకు చేరింది.

ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 2,254.64 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 4.15 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈ ఫిబ్రవరి నెలలో ఎఫ్ఐఐలు ఇప్పటివరకు మొత్తం మీద రూ. 4,900.17 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2,896.29 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 75 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
“నిఫ్టీ 25,800 ఎగువన ముగిసి డోజీ క్యాండిల్ని ఫార్మ్ చేసింది. అది అనిశ్చితికి సంకేతం. 25,795 వద్ద సూచీకి సపోర్ట్ ఉంది. ఇక్కడి నుంచి పెరిగితే సూచీ 26,000 వరకు వెళ్లొచచు. అది దాడితే 26,200 వరకు కూడా వెళ్లొచ్చు,” అని సెంట్రమ్ బ్రోకింగ్‌కి చెందిన నీలేశ్ జైన్ తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగించాయి. డౌ జోన్స్ 0.04 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 0.47శాతం వృద్ధిచెందింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.95 శాతం పెరిగింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్ సెషన్లో లాభాల్లో కొనసాగుతున్నాయి.
బంగారం, వెండి ధరలు..
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పడ్డాయి. స్పాట్ గోల్డ్ 1శాతం పడి ఔన్సుకు 5,016.56 డాలర్లకు చేరింది. స్పాట్ సిల్వర్ 2.5శాతం పడి ఔన్సుకు 81.31 డాలర్లకు వెళ్లింది.
స్టాక్స్ టు బై..
కరూర్ వైశ్యా బ్యాంక్- బై రూ. 327, స్టాప్ లాస్ రూ. 315, టార్గెట్ రూ. 351
రామ్‌కో సిమెంట్- బై రూ. 1205, స్టాప్ లాస్ రూ. 1162, టార్గెట్ రూ. 1291
నౌక్రీ- బై రూ. 1178, స్టాప్ లాస్ రూ. 1150, టార్గెట్ రూ. 1230
హెచ్డీఎఫ్సీ లైఫ్- బై రూ. 708, స్టాప్ లాస్ రూ. 690, టార్గెట్ రూ. 745
వేదాంత- బై రూ. 680, స్టాప్ లాస్ రూ. 650, టార్గెట్ రూ. 720
ఎల్ అండ్ టీ- బై రూ. 4113, స్టాప్ లాస్ రూ. 4040, టార్గెట్ రూ. 4250
బెల్‌రైస్- బై రూ. 185, స్టాప్ లాస్ రూ. 181, టార్గెట్ రూ. 197
పీటీసీ ఇండియా- బై రూ. 187.35, స్టాప్ లాస్ రూ. 183.50, టార్గెట్ రూ. 200
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper












