శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 95 పాయింట్లు పడి 83,216 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 17 పాయింట్లు కోల్పోయి 25,492 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ మాత్రం 323 పాయింట్లు పెరిగి 57,877 వద్దకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..

శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 4,581.34 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 6,674.77 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈ నెలలో ఎఫ్ఐఐలు ఇప్పటివరకు మొత్తం మీద రూ. 1,632.66 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 16,677.94 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ ఫ్లాట్‌గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ 2 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
“నిఫ్టీ50 50ఈఎంఏ కింద ట్రేడ్ అవుతోంది. ఇది షార్ట్ టర్మ్‌లో నెగిటివ్! 25,400 వద్ద సపోర్ట్ ఉంది. దాని కన్నా దిగువకు పడితే సెంటిమెంట్ మరింత బేరిష్‌గా మారొచ్చు. 25,600 వద్ద రెసిస్టెన్స్ ఉంది,” అని ఎల్కేపీ సెక్యూరిటీస్‌కి చెందిన సీనియర్ టెక్నికల్ ఎనలిస్ట్ రూపక్ దే తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. డౌ జోన్స్ 0.16 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 0.13శాతం పెరిగింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.21 శాతం డౌన్ పడింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్లో స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి.
స్టాక్స్ టు బై..
{{/usCountry}}ఆసియా స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్లో స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి.
స్టాక్స్ టు బై..
{{/usCountry}}ఇండియన్ మెటల్ అండ్ ఫెర్రో అలాయ్స్- బై రూ. 1197, స్టాప్ లాస్ రూ. 1150, టార్గెట్ రూ. 1290
రాడికో ఖైతాన్- బై రూ. 3310, స్టాప్ లాస్ రూ. 3200, టార్గెట్ రూ. 3570
ఒబేరాయ్ రియాల్టీ- బై రూ. 1786, స్టాప్ లాస్ రూ. 1750, టార్గెట్ రూ. 1860
బ్యాంక్ ఆఫ్ బరోడా- బై రూ. 289, స్టాప్ లాస్ రూ. 282, టార్గెట్ రూ. 305
ఇన్ఫోసిస్- బై రూ. 1478, స్టాప్ లాస్ రూ. 1445, టార్గెట్ రూ. 1520