మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 208 పాయింట్లు పెరిగి 84,274 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 68 పాయింట్లు పెరిగి 25,935 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ మాత్రం 43 పాయింట్లు పడి 60,626 వద్దకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
మంగళవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 69.45 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1,174.21 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈ ఫిబ్రవరి నెలలో ఎఫ్ఐఐలు ఇప్పటివరకు మొత్తం మీద రూ. 4,969.62 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 4,070.5 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక బుధవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 70 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
అని ఎల్కేపీ సెక్యూరిటీస్‌కి చెందిన సీనియర్ టెక్నికల్ రీసెర్చ్ ఎనలిస్ట్ రూపక్ దే తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. డౌ జోన్స్ 0.10 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 0.33శాతం పడింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.59 శాతం డౌన్ అయ్యింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు బుధవారం ట్రేడింగ్ సెషన్లో లాభాల్లో కొనసాగుతున్నాయి.
{{/usCountry}}ఆసియా స్టాక్ మార్కెట్లు బుధవారం ట్రేడింగ్ సెషన్లో లాభాల్లో కొనసాగుతున్నాయి.
{{/usCountry}}“25,790 వద్ద ఉన్న 50-డీఎంఏ.. నిఫ్టీ50కి కీలక సపోర్ట్‌గా ఉంది. అది బ్రేక్ అవ్వనంత వరకు సూచీ 26,000 వైపు వెళుతుంది. 26,000 దాటితే సూచీ 26,200 వరకు కూడా వెళ్లొచ్చు,” అని సెంట్రమ్ ఫిన్సర్వ్ లిమిటెడ్ హెడ్ ఆఫ్ టెక్నికల్ అండ్ డెరివేటివ్ రీసెర్చ్ నీలేశ్ జైన్ తెలిపారు.
బంగారం వెండి ధరలు..
అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ స్వల్ప లాభాలతో ఔన్సుకు 5,065 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. స్పాట్ గోల్డ్ 1.16శాతం పెరిగి ఔన్సుకు 81.32 డాలర్లకు చేరింది.
గరిష్ఠ స్థాయి (5,608.35 డాలర్ల) నుంచి బంగారం ధర దాదాపు 11శాతం దిగువన ఉంది. వెండి తన జీవితకాల గరిష్ఠం (121.67 డాలర్ల) నుంచి దాదాపు 50శాతం డౌన్లో ఉంది.
స్టాక్స్ టు బై..
టాటా స్టీల్- బై రూ. 208, స్టాప్ లాస్ రూ. 200, టార్గెట్ రూ. 224
భారత్ ఫోర్జ్- బై రూ. 1614, స్టాప్ లాస్ రూ. 1555, టార్గెట్ రూ. 1732
టాటా టెక్నాలజీస్- బై రూ. 630, స్టాప్ లాస్ రూ. 615, టార్గెట్ రూ. 660
బీఈఎల్- బై రూ. 438, స్టాప్ లాస్ రూ. 426, టార్గెట్ రూ. 465
ఇన్పోసిస్- బై రూ. 1495, స్టాప్ లాస్ రూ. 1465, టర్గెట్ రూ. 1530
గేబ్రియల్ ఇండియా- బై రూ. 998, స్టాప్ లాస్ రూ. 977, టార్గెట్ రూ. 1050
అక్మే సోలార్- బై రూ. 236.85, స్టాప్ లాస్ రూ. 231, టార్గెట్ రూ. 250
సీడీఎస్ఎల్- బై రూ. 1400, స్టాప్ లాస్ రూ. 1370, టార్గెట్ రూ. 1475