Stocks to buy : మరింత పడిన ముడి చమురు ధర- స్టాక్ మార్కెట్లకు ఊరట! ఈ స్టాక్స్‌తో లాభాలకు ఛాన్స్..
Stock market updates : మార్చ్ 11, ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన బ్రేకౌట్ స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు ముడి చమురు ధర, లేటెస్ట్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ని ఇక్కడ తెలుసుకోండి..
ఇరాన్- ఇజ్రాయెల్, అమెరికా అనిశ్చితుల మధ్య సోమవారం కనిపించిన భారీ పతనం అనంతరం మంగళవారం ట్రేడింగ్ సెషన్లో దేశీయ స్టాక్ మార్కెట్లు కోలుకున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 640 పాయింట్లు పెరిగి 78,206 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 236 పాయింట్లు వృద్ధిచెంది 24,262 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 931 పాయింట్లు పెరిగి 56,951 వద్దకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
మంగళవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 4,672.64 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 6,333.26 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక బుధవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 60 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
“నిఫ్టీ50 డైలీ చార్ట్‌లో లాంగ్ లోయర్ షాడోతో కూడిన చిన్న రెడ్ క్యాండిల్ ఏర్పడింది. ఇది బుల్లిష్కి వ్యతిరేక సిగ్నల్. అంటే 24,400- 24,500 లెవల్స్ వద్ద బలమైన రెసిస్టెన్స్ ఉందని అర్థం, నిఫ్టీ మీడియం టర్మ్ ఔట్లుక్ నెగిటివ్‌గా ఉంది,” అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్‌కి చెందిన సీనియర్ టెక్నికల్ రీసెర్చ్ ఎనలిస్ట్ నాగరాజ్ శెట్టి తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. డౌ జోన్స్ 0.07 శాతం పతనమైంది. ఎస్ అండ్ పీ 500 0.21శాతం పడింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.01 శాతం పెరిగింది.
బుధవారం ట్రేడింగ్ సెషన్లో ఆసియా స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సోమవారం నాటి అత్యంత భారీ పతనం నుంచి సూచీలు తేరుకుంటున్నాయి.
చమురు ధరలు..
సోమవారం అత్యంత భారీగా పెరిగి బ్యారెల్‌కు 119 డాలర్లు దాటిన బ్రెంట్ క్రూడ్ ధర ఇప్పుడు దిగొస్తోంది. తమ రిజర్వుల నుంచి భారీ మొత్తంలో (చరిత్రలోనే మునుపెన్నడు లేనంత) చమురును విడుదల చేస్తామని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ చేసిన ప్రకటనతో బ్రెంట్ క్రూడ్ పడింది.
ప్రస్తుతం ముడి చమురు ధర బ్యారెల్‌కు 87.57 డాలరుకు చేరింది.
చమురు ధరలు పడటం స్టాక్ మార్కెట్లకు మంచి విషయం.
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
అనుపమ్ రసాయన్ ఇండియా- బై రూ. 1294.10, స్టాప్‌లాస్ రూ. 1220, టార్గెట్ రూ. 1400
సెనైడర్ ఎలక్టరిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్- బై రూ. 923.60, స్టాప్ లాస్ రూ. 880, టార్గెట్ రూ. 1000
ఎంఎం ఫోర్జింగ్స్- బై రూ. 446.8, స్టాప్ లాస్ రూ. 425, టార్గెట్ రూ. 485
గోదావరి పవర్ అండ్ ఇస్పాట్- బై రూ. 253.80, స్టాప్ లాస్ రూ. 241, టార్గెట్ రూ. 275
ఔరబిందో ఫార్మా- బై రూ. 1285.90, స్టాప్ లాస్ రూ. 1240, టార్గెట్ రూ. 1400
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


