Stock market : భారీగా తగ్గిన చమురు ధరలు- స్టాక్​ మార్కెట్​లకు జోష్​! ఇవాళ భారీ లాభాలు?

Stock market news today : మార్చ్​ 10, ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ని ఇక్కడ తెలుసుకోండి..

Published on: Mar 10, 2026, 08:15:39 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఇరాన్​- ఇజ్రాయెల్​, అమెరికా అనిశ్చితుల మధ్య సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు నష్టాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 1353 పాయింట్లు పడి 77,566 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 422 పాయింట్లు కోల్పోయి 24,028 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 1763 పాయింట్లు పడి 56,010 వద్దకు చేరింది.

స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​..
స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​..

ఒకానొక సమయంలో సూచీలు మరింత దారుణంగా పడ్డాయి. నిఫ్టీ50 దాదాపు 700 పాయింట్లు వరకు డౌన్​ అయ్యింది. కాగా కింది స్థాయిలు నుంచి కొనుగోళ్లు కనిపించాయి.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 6,345.57 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 9,013.8 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈ మార్చ్​​​​ నెలలో ఎఫ్​ఐఐలు ఇప్పటివరకు మొత్తం మీద రూ. 28,176.76 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 41,800.72 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 270 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

“నిఫ్టీ50కి 24,00- 23,900 లెవల్స్​ కీలక సపోర్ట్​ జోన్​గా ఉన్నాయి. దాని దిగువకు పడితే సూచీలో మరింత అమ్మకాల ఒత్తిడి కనిపించవచ్చు. అక్కడి నుంచి 23,700కి, ఆ తర్వాత 23,500కి కూడా వెళ్లొచ్చు,” అని కొటాక్​ సెక్యూరిటీస్​ వెల్లడించింది.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. డౌ జోన్స్​ 0.5 శాతం పెరిగింది. ఎస్​ అండ్​ పీ 500​ 0.83శాతం పెరిగింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 1.3 శాతం వృద్ధిచెందింది.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇరాన్​తో యుద్ధంపై ట్రంప్​ చేసిన వ్యాఖ్యలతో ప్రపంచ స్టాక్​ మార్కెట్​లలో సానుకూలత నెలకొంది.

చమురు ధరలు..

సోమవారం అత్యంత భారీగా పెరిగి బ్యారెల్​కు రూ. 119 డాలర్లు దాటిన ముడి చమురు ధర, మంగళవారం దిగొచ్చింది. బ్రెంట్​ క్రూడ్​ ధర ప్రస్తుతం 6శాతానికిపైగా పడి బ్యారెల్​కు 92.45 డాలర్లకు చేరింది.

ఇరాన్​తో యుద్ధం ఎక్కువ కాలం కొనసాగపోవచ్చు అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ చేసిన వ్యాఖ్యలతో చమురు ధరలు పడ్డాయి.

ట్రంప్​ వ్యాఖ్యలకు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

స్టాక్స్​ టు బై..

డేటా పాటర్న్స్​- బై రూ. 3500, స్టాప్​ లాస్​ రూ. 3390, టార్గెట్​ రూ. 3850 (మల్టీడే)

ఔరఫార్మా- బై రూ. 1250, స్టాప్​ లాస్​ రూ. 1199, టార్గెట్​ రూ. 1350 (మల్టీడే)

వీఈడీఎల్​- బై రూ. 711, స్టాప్​ లాస్​ రూ. 699, టార్గెట్​ రూ. 760 (మల్టీడే)

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More