దేశీయ స్టాక్ మార్కెట్లో నష్టాల పరంపర కొనసాగుతోంది! శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని సైతం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 605 పాయింట్లు పడి 83,576 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 194 పాయింట్లు కోల్పోయి 25,683 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 435 పాయింట్లు పడి 59,252 వద్దకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..

శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 3,609.00 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 5,341.01 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ ఫ్లాట్‌గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 10 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
హైయ్యర్ లెవల్స్ వద్ద ప్రాఫిట్ బుకింగ్ కారణంగా నిఫ్టీ50 బలహీనంగా కనిపిస్తున్నట్టు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇండికేటర్లు ఓవర్‌సోల్డ్ పొజిషన్‌కి చేరాయని, ఫలితంగా పుల్-బ్యాక్ వచ్చే అవకాశం కూడా ఉందని వివరించారు. అయితే 26,000 దాటితే కానీ సూచీలో పాజిటివ్ ట్రెండ్ కనిపించకపోవచ్చని అభిప్రాయపడ్డారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగించాయి. డౌ జోన్స్ 0.48 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 0.65శాతం వృద్ధిచెందింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.81 శాతం పెరిగింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్లో స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి.
స్టాక్స్ టు బై..
అశోక్ లేల్యాండ్ లిమిటెడ్- బై రూ. 188, స్టాప్ లాస్ రూ. 181, టార్గెట్ రూ. 202
{{/usCountry}}అశోక్ లేల్యాండ్ లిమిటెడ్- బై రూ. 188, స్టాప్ లాస్ రూ. 181, టార్గెట్ రూ. 202
{{/usCountry}}ఇప్కా ల్యాబ్స్- బై రూ. 1575, స్టాప్ లాస్ రూ. 1520, టార్గెట్ రూ. 1685
రిలయన్స్ ఇండస్ట్రీస్- బై రూ. 1475, స్టాప్ లాస్ రూ. 1450, టార్గెట్ రూ. 1510
సెయిల్- బై రూ. 144, స్టాప్ లాస్ రూ. 138, టార్గెట్ రూ. 154
గుజరాత్ పిపావావ్ పోర్ట్ లిమిటెడ్- బై రూ. 186, స్టాప్ లాస్ రూ. 182, టార్గెట్ రూ. 194
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
సీసీఎల్ ప్రాడక్ట్స్ ఇండియా- బై రూ. 942.40, స్టాప్ లాస్ రూ. 897, టార్గెట్ రూ. 1035
కేఎస్బీ- బై రూ. 763.70, స్టాప్ లాస్ రూ. 730, టార్గెట్ రూ. 830
హెచ్‌సీఎల్ టెక్నాలజీస్- బై రూ. 1661.40, స్టాప్ లాస్ రూ. 1600, టార్గెట్ రూ. 1780
ఎండ్యురెన్స్ టెక్నాలజీస్- బై రూ. 2622, స్టాప్ లాస్ రూ. 2525, టార్గెట్ రూ. 2825
రామ్‌కో సిమెంట్స్ లిమిటెడ్- బై రూ. 1093.8, స్టాప్ లాస్ రూ. 1040, టార్గెట్ రూ. 1200