శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 450 పాయింట్లు పెరిగి 85,268 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 148 పాయింట్లు వృద్ధిచెంది 26,047 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 180 పాయింట్లు పెరిగి 59,390 వద్దకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..

శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 1,114.22 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3,868.94 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈ డిసెంబర్ నెలలో ఎఫ్ఐఐలు ఇప్పటివరకు మొత్తం మీద రూ. 19,605.51 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 39,970.2 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 100 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
“నిఫ్టీ50 26,000 లెవల్స్ దాటడం సానుకూల విషయం. 21ఈఎంఏని కూడా దాటింది. సూచీకి 25,900 కీలక సపోర్ట్‌గా, 26,300 కీలక రెసిస్టెన్స్‌గా ఉండే అవకాశం ఉంది,” అని ఎల్కేపీ సెక్యూరిటీస్‌కి చెందిన సీనియర్ టెక్నికల్ రీసెర్చ్ ఎనలిస్ట్ రూపక్ దే తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగించాయి. డౌ జోన్స్ 0.10 శాతం పతనమైంది. ఎస్ అండ్ పీ 500 1.07 శాతం పడింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 1.69 శాతం డౌన్ అయ్యింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్లో నష్టాల్లో కొనసాగుతున్నాయి.
స్టాక్స్ టు బై..
{{/usCountry}}ఆసియా స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్లో నష్టాల్లో కొనసాగుతున్నాయి.
స్టాక్స్ టు బై..
{{/usCountry}}వేదాంత- బై రూ. 543, స్టాప్ లాస్ రూ. 524, టార్గెట్ రూ. 581
అశోక్ లేల్యాండ్- బై రూ. 164, స్టాప్ లాస్ రూ. 158, టార్గెట్ రూ. 176
జుబీలియంట్ ఫుడ్- బై రూ. 583, స్టాప్ లాస్ రూ. 570, టార్గెట్ రూ. 610
ఐటీసీ- బై రూ. 400, స్టాప్ లాస్ రూ. 395, టార్గెట్ రూ. 410
టీసీఎస్- బై రూ. 3220, స్టాప్ లాస్ రూ. 3160, టార్గెట్ రూ. 3300
ఎటర్నల్ (జొమాటో)- బై రూ. 298, స్టాప్ లాస్ రూ. 291, టార్గెట్ రూ. 320
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
ఇండో బోరాక్స్ అండ్ కెమికల్స్: రూ.274 వద్ద కొనండి, టార్గెట్ రూ.295, స్టాప్ లాస్ రూ.264;
అట్లాంటా ఎలక్ట్రికల్స్: రూ .925 వద్ద కొనుగోలు, లక్ష్యం రూ .990, స్టాప్ లాస్ రూ .890;
జోటా హెల్త్ కేర్: రూ.1670 వద్ద కొనండి, టార్గెట్ రూ.1800, స్టాప్ లాస్ రూ.1600;
సీసీఎల్ ప్రొడక్ట్స్ (ఇండియా): రూ.1025 వద్ద కొనండి, టార్గెట్ రూ.1100, స్టాప్ లాస్ రూ.988;
సెనోరెస్ ఫార్మాస్యూటికల్స్: రూ .786 వద్ద కొనండి, రూ .850 టార్గెట్ చేయండి, స్టాప్ లాస్ రూ .760.