మంగళవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 533 పాయింట్లు పడి 84,680 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 167 పాయింట్లు కోల్పోయి 25,860 వద్ద సెషన్ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ మాత్రం 427 పాయింట్లు పెరిగి 59,035 వద్దకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..

మంగళవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 2,381.92 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1,077.48 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈ డిసెంబర్ నెలలో ఎఫ్ఐఐలు ఇప్పటివరకు మొత్తం మీద రూ. 23,455.75 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 42,839.93 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక బుధవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్ ఫ్లాట్గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 20 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
“నిఫ్టీ50కి 25,720 వద్ద సపోర్ట్ ఉంది. అది బ్రేక్ అయితే సూచీ 25,650- 25,600 వరకు వెళ్లొచ్చు. ఇక 26,000- 26,050 వద్ద రెసిస్టెన్స్ ఉంది. అది దాటితే కానీ బుల్లిష్ మూమెంట్ రాదు,” అని సామ్కో సెక్యూరిటీస్ టెక్నికల్ రీసెర్చ్ ఎనలిస్ట్ ఓం మెహ్రా తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
మంగళవారం ట్రేడింగ్ సెషన్ని అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ముగించాయి. డౌ జోన్స్ 0.62 శాతం పతనమైంది. ఎస్ అండ్ పీ 500 0.24శాతం పడింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.23 శాతం పెరిగింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు బుధవారం ట్రేడింగ్ సెషన్లో ఫ్లాట్గా కొనసాగుతున్నాయి.
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
{{/usCountry}}ఆసియా స్టాక్ మార్కెట్లు బుధవారం ట్రేడింగ్ సెషన్లో ఫ్లాట్గా కొనసాగుతున్నాయి.
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
{{/usCountry}}సిల్వర్ టచ్ టెక్నాలజీస్: రూ.878, టార్గెట్ రూ.945, స్టాప్ లాస్ రూ.850;
ప్రికోల్: రూ .632 వద్ద కొనండి, టార్గెట్ రూ .680, స్టాప్ లాస్ రూ .610;
రికో ఆటో ఇండస్ట్రీస్: రూ .122.7 వద్ద కొనండి, టార్గెట్ రూ .132, స్టాప్ లాస్ రూ .118;
అవంతి ఫీడ్స్: రూ .827 వద్ద కొనండి, టార్గెట్ రూ .888, స్టాప్ లాస్ రూ .800;
సుప్రజిత్ ఇంజినీరింగ్: రూ .460 వద్ద కొనండి, టార్గెట్ రూ .495, స్టాప్ లాస్ రూ .444.