గురువారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 1236 పాయింట్లు పడి 82,498 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 365 పాయింట్లు కోల్పోయి 25,454 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 811 పాయింట్లు పడి 60,740 వద్దకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..

గురువారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 880.49 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 596.28 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈ ఫిబ్రవరి నెలలో ఎఫ్ఐఐలు ఇప్పటివరకు మొత్తం మీద రూ. 1,076.63 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 11,474.03 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఓపెనింగ్ ఎలా ఉండబోతోంది?
ఇక శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ ఫ్లాట్‌గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 30 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
గురువారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. డౌ జోన్స్ 0.54 శాతం పతనమైంది. ఎస్ అండ్ పీ 500 0.28శాతం పడింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.31 శాతం డౌన్ అయ్యింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఫ్లాట్‌గా కొనసాగుతున్నాయి.
స్టాక్స్ టు బై..
యూపీఎల్- బై రూ. 765, స్టాప్ లాస్ రూ. 738, టార్గెట్ రూ. 820
{{/usCountry}}యూపీఎల్- బై రూ. 765, స్టాప్ లాస్ రూ. 738, టార్గెట్ రూ. 820
{{/usCountry}}బయోకాన్- బై రూ. 383, స్టాప్ లాస్ రూ. 370, టార్గెట్ రూ. 410
హెచ్డీఎఫ్సీ లైఫ్- బై రూ. 732, స్టాప్ లాస్ రూ. 715, టార్గెట్ రూ. 758
ఫోర్టిస్ హెల్త్‌కేర్- బై రూ. 906, స్టాప్ లాస్ రూ. 890, టార్గెట్ రూ. 940
టాటా టెక్నాలజీస్- బై రూ. 602, స్టాప్ లాస్ రూ. 590, టార్గెట్ రూ. 635
సమ్మాన్ క్యాపిటల్- బై రూ. 151.35, స్టాప్ లాస్ రూ. 147, టార్గెట్ రూ. 161
ఎంఎం ఫార్జింగ్- బై రూ. 488.5, స్టాప్ లాస్ రూ. 478, టార్గెట్ రూ. 520