సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగించాయి! బీఎస్ఈ సెన్సెక్స్ 638 పాయింట్లు పెరిగి 85,567 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 206 పాయింట్లు వృద్ధిచెంది 26,172 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 235 పాయింట్లు పెరిగి 59,304 వద్దకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..

సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 4571.34 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 4,058.22 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈ డిసెంబర్ నెలలో ఎఫ్ఐఐలు ఇప్పటివరకు మొత్తం మీద రూ. 20,314.71 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 56,090.34 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 70 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
“నిఫ్టీ50లో ట్రెండ్ పాజిటివ్‌గా ఉంది. ముమెంటమ్ ఇండికేటర్స్ మెరుగ్గా ఉన్నాయి. ఫాలింగ్ వెడ్జ్ బ్రేకౌట్ తర్వాత మరింత పైకి వెళుతోంది. ఆర్ఎస్ఐలో బలమైన పాజిటివ్ ముమెంటమ్ కనిపిస్తోంది. సూచీ 25,900 ఎగువన ఉన్న వరకు పాటిజివ్ ట్రెండ్ ఉన్నట్టు. 26,315 వద్ద రెసిస్టెన్స్ ఉంది,” అని ఎల్కేపీ సెక్యూరిటీస్‌కి చెందిన సీనియర్ టెక్నికల్ రీసెర్చ్ ఎనలిస్ట్ రూపక్ దే తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగించాయి. డౌ జోన్స్ 0.47 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 0.64శాతం వృద్ధిచెందింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.52 శాతం పెరిగింది.
{{/usCountry}}సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగించాయి. డౌ జోన్స్ 0.47 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 0.64శాతం వృద్ధిచెందింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.52 శాతం పెరిగింది.
{{/usCountry}}ఆసియా స్టాక్ మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్ సెషన్లో లాభాల్లో కొనసాగుతున్నాయి.
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
వరుణ్ బేవరేజ్: రూ .485.65 వద్ద కొనండి, టార్గెట్ రూ .515, స్టాప్ లాస్ రూ .470;
త్రివేణి ఇంజనీరింగ్ అండ్ ఇండస్ట్రీస్: రూ .389.55 వద్ద కొనండి, టార్గెట్ రూ .415, స్టాప్ లాస్ రూ .374;
బీఈఎంఎల్: రూ .1795.80 వద్ద కొనండి, టార్గెట్ రూ .1930, స్టాప్ లాస్ రూ .1725;
చంబల్ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్: రూ.465.95 వద్ద కొనండి, రూ.505 టార్గెట్, స్టాప్ లాస్ రూ.445;
టిటాగర్ రైల్ సిస్టమ్స్: రూ .816.50 వద్ద కొనండి, టార్గెట్ రూ .890, స్టాప్ లాస్ రూ .777.