మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 43 పాయింట్లు పడి 85,525 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 5 పాయింట్లు పెరిగి 26,177 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 4 పాయింట్లు పడి 59,300 వద్దకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..

మంగళవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 1,794.8 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3,812.37 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈ డిసెంబర్ నెలలో ఎఫ్ఐఐలు ఇప్పటివరకు మొత్తం మీద రూ. 22,109.51 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 59,902.71 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక బుధవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ ఫ్లాట్‌గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 35 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
“26,200 వద్ద రెసిస్టెన్స్‌ని ఎదుర్కొన్న అనంతరం నిఫ్టీ50 లాభాలకు బ్రేక్ పడింది. డైలీ చార్ట్ క్యాండిల్‌లో చిన్న బేరిష్ క్యాండిల్ ఏర్పడింది. కానీ ఆర్ఎస్ఐ, మాక్డీ వంటి కీలక ఇండికేటర్లు ఫేవరెబుల్గానే ఉన్నాయి. ఇప్పుడు సపోర్ట్ 26,000 జోన్‌కి షిఫ్ట్ అయ్యింది. 21డీఎంఏ కూడా ఇక్కడే ఉంది. సూచీ 26,300 వరకు వెళ్లొచ్చు,” అని సెంట్రమ్ బ్రోకింగ్‌కి చెందిన టెక్నికల్ అండ్ డెరివేటివ్స్ రీసెర్చ్ ఎనలిస్ట్- హెడ్ నిలేశ్ జైన్ తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. డౌ జోన్స్ 0.2 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 0.5శాతం వృద్ధిచెందింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.6 పెరిగింది.
{{/usCountry}}మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. డౌ జోన్స్ 0.2 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 0.5శాతం వృద్ధిచెందింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.6 పెరిగింది.
{{/usCountry}}ఆసియా స్టాక్ మార్కెట్లు బుధవారం ట్రేడింగ్ సెషన్లో స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి.
స్టాక్స్ టు బై..
నైకా- బై రూ. 256, స్టాప్ లాస్ రూ. 248, టార్గెట్ రూ. 265
జేబీఎం ఆటో- బై రూ. 250, స్టాప్ లాస్ రూ .240, టార్గెట్ రూ. 270
బాల్మర్ లారేయ్- బై రూ. 180, స్టాప్ లాస్ రూ. 176, టార్గెట్ రూ. 190
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్- బై రూ. 104.89, స్టాప్ లాస్ రూ. 99.70, టార్గెట్ రూ. 115
ఎన్ఎల్సీ ఇండియా- బై రూ. 251.90, స్టాప్ లాస్ రూ .240, టార్గెట్ రూ. 275
జేకే టైర్ అండ్ ఇండస్ట్రీస్- బై రూ. 510.3, స్టాప్ లాస్ రూ. 488, టార్గెట్ రూ. 550
అఫిల్ 3ఐ- బై రూ. 1766, స్టాప్ లాస్ రూ. 1690, టార్గెట్ రూ. 1910
శారదా ఎనర్జీ అండ్ మినరల్స్- బై రూ. 530. 25, స్టాప్ లాస్ రూ. 508, టార్గెట్ రూ. 570