బుధవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 791 పాయింట్లు పెరిగి 76,991 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 198 పాయింట్లు వృద్ధిచెంది 24,022 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 967 పాయింట్లు పెరిగి 58,150 వద్దకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..

బుధవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 1,843.40 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3,637.26 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక గురువారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 65 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
“నిఫ్టీ50కి 24,150- 24,200 జోన్ కీలక రెసిస్టెన్స్‌గా ఉంది. అది దాటితే సూచీ 24,500- 24,600 వరకు వెళ్లొచ్చు. ఇక 23,800 వద్ద కీలక సపోర్ట్ ఉంది,” అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్‌కి చెందిన సీనియర్ టెక్నికల్ రీసెర్చ్ ఎనలిస్ట్ నాగరాజ్ శెట్టి తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
బుధవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. డౌ జోన్స్ 0.35 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 0.10శాతం పడింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.43 శాతం డౌన్ అయ్యింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు గురువారం ట్రేడింగ్ సెషన్లో స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధర..
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు అమెరికా- ఇరాన్ యుద్ధం ముందు దశకు చేరుకున్నాయి. బ్రెంట్ క్రూడ్ 0.54శాతం పడి బ్యారెల్‌కి 73.34 డాలర్లకు చేరింది.
స్టాక్స్ టు బై..
{{/usCountry}}అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు అమెరికా- ఇరాన్ యుద్ధం ముందు దశకు చేరుకున్నాయి. బ్రెంట్ క్రూడ్ 0.54శాతం పడి బ్యారెల్‌కి 73.34 డాలర్లకు చేరింది.
స్టాక్స్ టు బై..
{{/usCountry}}గ్లాండ్ ఫార్మా- బై రూ. 2330, స్టాప్ లాస్ రూ .2180, టార్గెట్ రూ. 23675
క్రెడిట్‌యాక్సెస్ గ్రామీన్- బై రూ. 1465, స్టాప్ లాస్ రూ. 1380, టార్గెట్ రూ. 1615
హింద్పెట్రో- బై రూ. 414, స్టాప్ లాస్ రూ. 397, టార్గెట్ రూ. 450
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
నవీన్ ఫ్లోరిన్ ఇంటర్నేషనల్- బై రూ. 7698, స్టాప్ లాస్ రూ. 7380, టార్గెట్ రూ. 8280
ఎన్సీసీ- బై రూ. 157.50, స్టాప్ లాస్ రూ. 150, టర్గెట్ రూ. 170
గ్లోబల్ హెల్త్ లిమిటెడ్- బై రూ. 1318, స్టాప్ లాస్ రూ .1265
రాడికో ఖైతాన్- బై రూ. 3758, స్టాప్ లాస్ రూ. 3550, టార్గెట్ రూ. 4200
నెట్వెబ్ టెక్నాలజీస్ ఇండియా- బై రూ. 5074, స్టాప్ లాస్ రూ. 4865, టార్గెట్ రూ. 5500