...
...
Next Story

ట్రేడర్స్​ అలర్ట్​! నిపుణులు సిఫార్సు చేసిన 10 stocks to buy లిస్ట్​ ఇది..

ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై, బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ని ఇక్కడ తెలుసుకోండి..

Published on: Nov 25, 2025, 08:15:06 IST
Advertisement

సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు నష్టాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 331 పాయింట్లు పడి 84,901 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 109 పాయింట్లు కోల్పోయి 25,959 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 325 పాయింట్లు పడి 58,835 వద్దకు చేరింది.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

స్టాక్​ మార్కెట్​ లేటెస్ట్​ అప్డేట్స్​..
స్టాక్​ మార్కెట్​ లేటెస్ట్​ అప్డేట్స్​..

మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 4,071.63 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 4,373.87 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈ సెప్టెంబర్​​​ నెలలో ఎఫ్​ఐఐలు ఇప్పటివరకు మొత్తం మీద రూ. 17,032.93 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 43,578.19 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక బుధవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ ఫ్లాట్​గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 12 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

“నిఫ్టీ50 25,950 దిగువకు వెళితే, మరింత ఒత్తిడి కనిపించవచ్చు. 25,850 వద్ద సపోర్ట్​ ఉంది. 26,100 లెవల్స్​ వద్ద రెసిస్టెన్స్​ ఉంది,” అని ఎల్​కేపీ సెక్యూరిటీస్​కి చెందిన టెక్నికల్​ ఎనలిస్ట్​ వత్సల్​ భవ తెలిపారు.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు లాభాల్లో ముగించాయి. డౌ జోన్స్​ 0.44 శాతం పెరిగింది. ఎస్​ అండ్​ పీ 500​ 1.55శాతం వృద్ధిచెందింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 2.69 శాతం పెరిగింది.

ఫెడరల్​ బ్యాంక్​- బై రూ. 248, స్టాప్​ లాస్​ రూ. 239, టార్గెట్​ రూ. 266

టెక్​ మహీంద్రా- బై రూ. 1495, స్టాప్​ లాస్​ రూ. 1443, టార్గెట్​ రూ. 1600

కేఈఐ ఇండస్ట్రీస్​- బై రూ. 4108, స్టాప్​ లాస్​ రూ. 4050, టార్గెట్​ రూ. 4200

ఆస్ట్రా మైక్రోవేవ్​ ప్రాడక్ట్స్​- బై రూ. 940, స్టాప్​ లాస్​ రూ. 920, టార్గెట్​ రూ. 990

ఆస్ట్రల్​ లిమిటెడ్​- బై రూ. 1470, స్టాప్​ లాస్​రూ. 1420, టార్గెట్​ రూ. 1530

బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై..

యథార్థ్ హాస్పిటల్ అండ్​ ట్రామా క్రె ఎస్ఆర్వీసీఎస్: రూ.792 వద్ద కొనండి, రూ.850 టార్గెట్ రూ.850, స్టాప్ లాస్ రూ.765;

సఫారీ ఇండస్ట్రీస్ (ఇండియా): రూ .2360 వద్ద కొనండి, లక్ష్యం రూ .2540, స్టాప్ లాస్ రూ .2275;

అకుటాస్ కెమికల్స్: రూ .1872 వద్ద కొనండి, లక్ష్యం రూ .2020, స్టాప్ లాస్ రూ .1808;

డాక్టర్ అగర్వాల్ హెల్త్ కేర్: రూ .506 వద్ద కొనండి, లక్ష్యం రూ .545, స్టాప్ లాస్ రూ .488;

సాయి లైఫ్ సైన్సెస్: రూ .883 వద్ద కొనండి, లక్ష్యం రూ .950, స్టాప్ లాస్ రూ .850

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe