...
...
Next Story

ట్రేడర్స్​ అలర్ట్​- మీరు ట్రాక్​ చేయాల్సిన 10 స్టాక్స్​ టు బై లిస్ట్​ ఇదే..

నవంబర్​ 28, ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై, బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ని ఇక్కడ తెలుసుకోండి..

Published on: Nov 28, 2025, 08:15:13 IST
Advertisement

గురువారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 111 పాయింట్లు పెరిగి 85,720 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 10 పాయింట్లు వృద్ధిచెంది 26,216 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 209 పాయింట్లు పెరిగి 59,737 వద్దకు చేరింది.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​..
స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​..

గురువారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 1,996.40 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3,551.88 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ ఫ్లాట్​గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 30 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

“నిఫ్టీ50కి 26,000 వద్ద సపోర్ట్​ ఉంది. అది బ్రేక్​ అవ్వనంత వరకు సూచీ 26,440- 26,580 వరకు వెళ్లే అవకాశం ఉంది. కొన్ని రోజులుగా సూచీ బాగా పెరిగింది కాబట్టి, ఇక్కడి నుంచి కింద పడినా బై-ఆన్​ డిప్స్​ స్ట్రాటజీని అనుసరించవచ్చు,” అని ఎల్​కేపీ సెక్యూరిటీస్​కి చెందిన సీనియర్​ టెక్నికల్​ ఎనలిస్ట్​ రూపక్​ దే తెలిపారు.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

థాంక్స్​గివింగ్​ కారణంగా గురువారంఅమెరికా స్టాక్​ మార్కెట్​లకు సెలవు. శుక్రవారం సైతం తొందరగా క్లోజ్​ అవుతాయి. కాగా స్టాక్​ ఫ్యూచర్స్​ మాత్రం ఫ్లాట్​గా కొనసాగుతున్నాయి.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఫ్లాట్​గా కొనసాగుతున్నాయి.

స్టాక్స్​ టు బై..

శ్రీరామ్​ ఫైనాన్స్​- బై రూ. 868, స్టాప్​ లాస్​ రూ. 838, టార్గెట్​ రూ. 928

ఐసీఐసీఐ బ్యాంక్​- బై రూ. 1390, స్టాప్​ లాస్​ రూ. 1360, టార్గెట్​ రూ. 1430

ఒబెరాయ్​ రియాల్టీ- బై రూ. 16660, స్టాప్​ లాస్​ రూ. 1600, టార్గెట్​ రూ. 1735

పంజాబ్​ నేషనల్​ బ్యాంక్​- బై రూ. 124, స్టాప్​ లాస్​ రూ. 118, టార్గెట్​ రూ. 129

బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై..

కరారో ఇండియా: రూ .557 వద్ద కొనండి, టార్గెట్ రూ .600, స్టాప్ లాస్ రూ .535;

ప్రెసిషన్ వైర్స్ ఇండియా: రూ .256 వద్ద కొనండి, టార్గెట్ రూ .276, స్టాప్ లాస్ రూ .248;

బెల్రైజ్ ఇండస్ట్రీస్: రూ .167 వద్ద కొనండి, టార్గెట్ రూ .181, స్టాప్ లాస్ రూ .162;

యురేకా ఫోర్బ్స్: రూ .607 వద్ద కొనండి, టార్గెట్ రూ .650, స్టాప్ లాస్ రూ .585;

తత్వా చింతన్ ఫార్మా కెమ్: రూ .1492 వద్ద కొనండి, రూ .1600 టార్గెట్ చేయండి, స్టాప్ లాస్ రూ .1444.

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe