మంగళవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 504 పాయింట్లు పడి 85,138 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 144 పాయింట్లు కోల్పోయి 26,032 వద్ద సెషన్ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 408 పాయింట్లు పడి 59,274 వద్దకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..

మంగళవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 3,642.3 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 4,645.94 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈ నెలలో ఎఫ్ఐఐలు ఇప్పటివరకు మొత్తం మీద రూ. 4,813.61 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 7,204.87 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక బుధవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్ ఫ్లాట్గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 5 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
మంగళవారం ట్రేడింగ్ సెషన్ని అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ముగించాయి. డౌ జోన్స్ 0.39 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 0.25శాతం వృద్ధిచెందింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.59 శాతం పెరిగింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు బుధవారం ట్రేడింగ్ సెషన్లో లాభాల్లో కొనసాగుతున్నాయి.
స్టాక్స్ టు బై..
సంవర్ధన మథర్సన్ ఇంటర్నేషనల్- బై రూ. 119.26, స్టాప్ లాస్ రూ. 115, టార్గెట్ రూ. 128
వేదంత- బై రూ. 538, స్టాప్ లాస్ రూ. 519, టార్గెట్ రూ. 576
{{/usCountry}}వేదంత- బై రూ. 538, స్టాప్ లాస్ రూ. 519, టార్గెట్ రూ. 576
{{/usCountry}}ఇండస్ఇండ్ బ్యాంక్- బై రూ. 853, స్టాప్ లాస్ రూ. 840, టార్గెట్ రూ. 875
అధానీ ఎంటర్ప్రైజెస్- బై రూ. 2240, స్టాప్ లాస్ రూ. 2180, టార్గెట్ రూ. 2340
బ్యాంక్ ఆఫ్ ఇండియా- బై రూ. 146, స్టాప్ లాస్ రూ. 140, టార్గెట్ రూ. 152
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
బిర్లాసాఫ్ట్ : రూ .405 వద్ద కొనండి, టార్గెట్ రూ .433, స్టాప్ లాస్ రూ .388;
స్టెల్ హోల్డింగ్స్: రూ .534 వద్ద కొనండి, లక్ష్యం రూ .575, స్టాప్ లాస్ రూ .515;
మిండా కార్పొరేషన్: రూ .600 వద్ద కొనండి, టార్గెట్ రూ .645, స్టాప్ లాస్ రూ .580;
జమ్నా ఆటో ఇండస్ట్రీస్: రూ .122 వద్ద కొనండి, టార్గెట్ రూ .132, స్టాప్ లాస్ రూ .118;
స్టైలం ఇండస్ట్రీస్: రూ .2140 వద్ద కొనండి, రూ .2300 టార్గెట్ చేయండి, స్టాప్ లాస్ రూ .2065.