సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 346 పాయింట్లు పడి 84,696 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 100 పాయింట్లు కోల్పోయి 25,942 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 79 పాయింట్లు పడి 58,932 వద్దకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 2,759.89 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2,643.85 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈ డిసెంబర్ నెలలో ఎఫ్ఐఐలు ఇప్పటివరకు మొత్తం మీద రూ. 26,908.2 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 66,700.46 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ ఫ్లాట్‌గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 30 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
“నిఫ్టీ50 చార్ట్‌లో కనిపిస్తున్న లోయర్ హైస్- లోయర్ లోస్ స్వల్ప కాల వీక్నెస్ని సూచిస్తోంది. 25,920 దగ్గర సూచీకి సపోర్ట్ ఉంది. అది బ్రేక్ అయితే సూచీ 25,800 వరకు వెళ్లొచ్చు. రానున్న రోజుల్లో నిఫ్టీ50 25,800- 26,100 మధ్య కదలాడే అవకాశం ఉంది,” అని టెక్నికల్ అండ్ డెరివేటివ్స్ రీసెర్చ్ ఎనలిస్ట్ నీలేశ్ జైన్ తెలిపారు.
- Zepto IPO: సెబీకి గోప్యతతో కూడిన DRHP ని దాఖలు చేసిన జెప్టో! పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ముగించాయి. డౌ జోన్స్ 0.5 శాతం పతనమైంది. ఎస్ అండ్ పీ 500 0.3శాతం పడింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.5 శాతం డౌన్ అయ్యింది.
{{/usCountry}}మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ముగించాయి. డౌ జోన్స్ 0.5 శాతం పతనమైంది. ఎస్ అండ్ పీ 500 0.3శాతం పడింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.5 శాతం డౌన్ అయ్యింది.
{{/usCountry}}ఆసియా స్టాక్ మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్ సెషన్లో నష్టాల్లో కొనసాగుతున్నాయి.
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
ఎన్ఎల్సీ ఇండియా- బై రూ. 256.4, స్టాప్ లాస్ రూ. 247, టార్గెట్ రూ. 275
ఇండియా సిమెంట్స్- బై రూ. 448.05, స్టాప్ లాస్ రూ. 424, టార్గెట్ రూ. 490
సిటీ యూనియన్ బ్యాంక్- బై రూ. 298.95, స్టాప్ లాస్ రూ. 285, టార్గెట్ రూ. 327
హొనాసా కన్జ్యూమర్- బై రూ. 277, స్టాప్ లాస్ రూ. 265, టార్గెట్ రూ. 299
ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ- బై రూ. 95.04, స్టాప్ లాస్ రూ. 91.96, టార్గెట్ రూ. 101.5